శ్రద్ధా కామెంట్లపై శామ్ ఫ్యాన్స్ ఫైర్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బెంగళూరు బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఈ భామ సమంత చిత్రంపై సంచలన కామెంట్లు చేసింది. దీంతో సమంత అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. కాగా కన్నడ ‘యూటర్న్‌’లో శ్రద్ధా శ్రీనాథ్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధా నటనకు సర్వత్రా ప్రశంసలు […]

శ్రద్ధా కామెంట్లపై శామ్ ఫ్యాన్స్ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2019 | 11:53 AM

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బెంగళూరు బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఈ భామ సమంత చిత్రంపై సంచలన కామెంట్లు చేసింది. దీంతో సమంత అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

కాగా కన్నడ ‘యూటర్న్‌’లో శ్రద్ధా శ్రీనాథ్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధా నటనకు సర్వత్రా ప్రశంసలు లభించడంతో పాటు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయగా.. అందులో సమంత నటించింది. అయితే ఈ మూవీపై విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం డీలా పడింది. దీంతో టాలీవుడ్‌లో ‘యూటర్న్’ ఫ్లాప్‌గా మిగిలిపోయింది.

ఇక ఈ చిత్రంపై శ్రద్ధా తాజాగా మాట్లాడుతూ.. ‘‘అవును నేను చాలా పొసెసివ్. రచన పాత్రలో ఎవ్వరినీ ఊహించుకోలేను. తెలుగు యూటర్న్‌ను 30 నిమిషాలు కూడా చూడలేకపోయా. ఈ సినిమా మొత్తాన్ని ఒకసారి చూసేందుకు ప్రయత్నిస్తా’’ అంటూ పేర్కొంది. దీంతో ఈ వ్యాఖ్యలపై సమంత అభిమానులు ఫైర్ అవుతున్నారు. తనకన్నా సీనియర్ తారల గురించి మాట్లాడేముందు కాస్త ఆలోచించాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి మొదటి సినిమాతోనే వివాదం కొని తెచ్చుకున్న శ్రద్ధా తెలుగు ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.