సల్మాన్ ఫస్ట్‌లుక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ఓ దేశం, ఓ వ్యక్తి కలిసి చేసే ప్రయాణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తుండగా.. దిశా పటానీ మరో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో వృద్ధుడి లుక్‌లో అందరిని షాక్‌కు గురిచేశాడు సల్మాన్. Jitne safed baal mere sar […]

సల్మాన్ ఫస్ట్‌లుక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 15, 2019 | 1:48 PM

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ఓ దేశం, ఓ వ్యక్తి కలిసి చేసే ప్రయాణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తుండగా.. దిశా పటానీ మరో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో వృద్ధుడి లుక్‌లో అందరిని షాక్‌కు గురిచేశాడు సల్మాన్.

అయితే ‘భారత్‌’లో సల్మాన్ 20ఏళ్ల యువకుడి నుంచి 70ఏళ్ల వృద్ధుడి వరకు రకరకాల పాత్రలలో కనిపించనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వచ్చిన లుక్ వాటికి బలాన్ని చేకూర్చింది. ఇదిలా ఉంటే ఈ లుక్‌పై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు షాక్‌కు గురౌతున్నారు. ఇలాంటి లుక్‌తో ట్విస్ట్ ఇస్తారని ఊహించలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా రంజాన్ సందర్భంగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే.