నేను రిచ్‌గానే పుట్టా, రిచ్‌గా పెరిగా, రిచ్‌గానే ఉంటా

అల్లు శిరీశ్ హీరోగా కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళంలో విజయం సాధించిన ‘ఏబీసీడీ’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రంలో అల్లు శిరీశ్ సరసన రుక్సార్ నటించగా.. భరత్, నాగబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. […]

నేను రిచ్‌గానే పుట్టా, రిచ్‌గా పెరిగా, రిచ్‌గానే ఉంటా


అల్లు శిరీశ్ హీరోగా కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళంలో విజయం సాధించిన ‘ఏబీసీడీ’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రంలో అల్లు శిరీశ్ సరసన రుక్సార్ నటించగా.. భరత్, నాగబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. మధుర శ్రీధర్, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క క్షణం పరాజయం తరువాత వస్తోన్న ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకున్నాడు అల్లు శిరీశ్.

Click on your DTH Provider to Add TV9 Telugu