రావల్పిండి ఎక్స్‌ప్రెస్ రీ ఎంట్రీ

ఇంటర్నెట్: మాజీ పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్‌ అఖ్తర్‌ తన అభిమానులకు తీపి కబురు తెచ్చాడు. ఫిబ్రవరి14న మళ్లీ క్రికెట్‌లోకి వస్తున్నట్లు ఆయన ట్విటర్‌ వేదికగా బుధవారం ప్రకటించాడు. ‘‘ ఈరోజుల్లో పిల్లలు తమకు క్రికెట్ గురించి చాలా విషయాలు తెలుసనుకుంటారు. అంతేకాదు నా ఫాస్ట్ బౌలింగ్‌ను సవాల్‌ కూడా చేయగలరు. కాబట్టి నేను మళ్లీ బంతి పట్టుకుంటున్నాను. అసలైన బౌలింగ్‌ వేగం అంటే ఏంటో వారికి నేను చూపిస్తాను’’ అని తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో వీడియో ఫోస్ట్ చేశారు. ఫిబ్రవరి […]

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ రీ ఎంట్రీ
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 11:00 PM

ఇంటర్నెట్:

మాజీ పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్‌ అఖ్తర్‌ తన అభిమానులకు తీపి కబురు తెచ్చాడు. ఫిబ్రవరి14న మళ్లీ క్రికెట్‌లోకి వస్తున్నట్లు ఆయన ట్విటర్‌ వేదికగా బుధవారం ప్రకటించాడు. ‘‘ ఈరోజుల్లో పిల్లలు తమకు క్రికెట్ గురించి చాలా విషయాలు తెలుసనుకుంటారు. అంతేకాదు నా ఫాస్ట్ బౌలింగ్‌ను సవాల్‌ కూడా చేయగలరు. కాబట్టి నేను మళ్లీ బంతి పట్టుకుంటున్నాను. అసలైన బౌలింగ్‌ వేగం అంటే ఏంటో వారికి నేను చూపిస్తాను’’ అని తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో వీడియో ఫోస్ట్ చేశారు. ఫిబ్రవరి 14న కాలెండర్‌లో తేదీని మార్క్‌ చేసుకోండని అభిమానులకు షోయబ్‌  సూచించడం కొస మెరుపు. అయితే  సేమ్ డేట్ న  పాకిస్థాన్ సూపర్‌ లీగ్ లుగో సీజన్‌ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా షోయబ్‌ తిరిగి క్రికెట్‌లోకి రావటం పట్ల  మాజీ పాకిస్థాన్‌ క్రికెటర్‌ వసీం అక్రం, షోయబ్‌ మాలిక్‌లు స్పందించారు. షోయబ్‌ రాకను స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు.