రియల్ లైఫ్ కపుల్ నాగచైతన్య, సమంత కలిసి నటిస్తోన్న చిత్రం ‘మజిలీ’. పెళ్లైన తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి చిత్రం ఇదే కాగా.. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా మజిలీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎమోషనల్‌గా వచ్చిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కథను టీజర్‌లోనే చూపించి సినిమాపై ఆసక్తిని పెంచాడు దర్శకుడు. ముఖ్యంగా గోపి సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు ప్లస్‌గా మారింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తరువాత వరుస పరాజయాలతో ఢీలా పడ్డ నాగ చైతన్య.. మజిలీతో మళ్లీ ఫాంలోకి రావాలనుకుంటున్నాడు.