AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ చాలా గొప్పది.. ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారు..

సుమన్.. ఇప్పుడంటే విలన్ పాత్రలు, సహాయక నటుడి రోల్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు దక్షిణాదిలో ఉన్న స్టార్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. తన నటనతో మరీ ముఖ్యంగా కరాటే ఫైట్స్, యాక్షన్ సీన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారీ సీనియర్ యాక్టర్. 1978లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సుమన్.

ఆ హీరోయిన్ చాలా గొప్పది.. ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారు..
Suman
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 2:44 PM

Share

ప్రముఖ నటుడు సుమన్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, ఒక నటితో తన అనుభవాలను సుమంత్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సుమన్ మాట్లాడుతూ.. తన సినిమాలలోని మ్యూజికల్ హిట్‌ల గురించి మాట్లాడుతూ, రాజ్-కోటి, ఇళయరాజా వంటి సంగీత దర్శకుల పాత్రను సుమన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పట్లో ఇళయరాజా చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందించేవారని, కానీ రాజ్-కోటి తనకు, చిరంజీవి గారికి అద్భుతమైన పాటలు ఇచ్చేవారని తెలిపారు. దర్శకుడు శరత్ తన పాటల చిత్రీకరణకు ఎంతో కృషి చేశారని, ట్యూన్‌కు తగ్గట్టుగా నృత్యాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారని సుమన్ గుర్తు చేసుకున్నారు. తన కోసం మంచి ట్యూన్‌లు అందించిన సంగీత దర్శకులకు, వాటిని అద్భుతంగా చిత్రీకరించిన దర్శకులకు సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో చిరంజీవి గారి పాటలు, తన పాటలు మార్కెట్‌లో పోటీ పడేవని, కానీ ఎవరి స్టైల్ వారిదేనని, ఏది దేనితో కలవకుండా విభిన్నంగా ఉండేవని పేర్కొన్నారు. ఆడియో హిట్ అయిందో లేదో తెలుసుకోవడానికి క్యాసెట్ల అమ్మకాలు, పల్లెటూళ్లలో ఆటోలు, టాక్సీల్లో పాటలు వినిపించే తీరు ప్రధానంగా ఉండేవని చెప్పారు. తన పాటలు రోడ్లపై వినిపించినప్పుడు కార్లో కూర్చుని ఆ పాటలను వినడం ఒక థ్రిల్ అని, ఇప్పటికీ కొన్ని గ్రామాలలో తన పాత సినిమాలు, పాటలు వినిపిస్తున్నాయి సుమన్ ఆనందంగా వెల్లడించారు. గజ్జ ఘల్లుమన్నది వంటి పాటలకు ఇప్పటికీ ఆదరణ ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

బావ బామ్మర్ది సినిమా గురించి మాట్లాడుతూ, కృష్ణం రాజు, జయసుధలతో కలిసి పని చేయడం గొప్ప అనుభవమని చెప్పారు. కృష్ణం రాజు చాలా ఫ్రెండ్లీ అని, తనను సొంత తమ్ముడిలా చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో కృష్ణం రాజు సరదాగా ఉండేవారని వివరించారు. జయసుధ కూడా సీనియర్ అయినా చాలా జెంటిల్‌గా, కైండ్‌గా ఉండేవారని తెలిపారు. ఆ సినిమాలోని సెంటిమెంట్స్ ప్రజలకు బాగా చేరువయ్యాయని, సినిమా చూసిన తర్వాత కూడా తనను రాజు అని పిలిచేవారని సుమన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక వండర్‌ఫుల్ గర్ల్ అని, ఎంతో క్రమశిక్షణతో ఉండేవారని సుమన్ ప్రశంసించారు. ఆమె డ్రెస్సింగ్, మేకప్ విషయంలో అత్యుత్తమంగా ఉండేవారని, తన డ్రెస్సులను స్వయంగా ఎంపిక చేసుకునేవారని చెప్పారు. చాలా స్నేహపూర్వకంగా, ఫ్రాంక్‌గా ఉండేవారని, అయితే ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే చాలా స్ట్రాంగ్ గా, టఫ్‌గా ఉండేవారని సుమన్ తెలిపారు. తనతో మాత్రం తాను ప్రొఫెషనల్‌గా ఉన్నందున ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉండేవారని పేర్కొన్నారు. సిల్క్ స్మిత ఎంతో కష్టపడే నటి అని, ఆమె ఆత్మహత్య చేసుకుని దూరమవ్వడం చాలా దురదృష్టకరమని సుమన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారని, ఆ సీటు ఇప్పటికీ ఖాళీగానే ఉందని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తెలిసినప్పుడు తాను చాలా అప్సెట్ అయ్యానని, అంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారని బాధపడ్డానని చెప్పారు.ఆమెను చాలా మిస్ అవుతున్నానని సుమన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us