AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samajavaragamana Movie: సామజవరగమన మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే

ఎప్పుడు సీరియస్ సినిమాలతో వచ్చే శ్రీ విష్ణు ఈసారి ట్రాక్ మార్చి పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సామజవరగమన అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేశాడు. మరి ఇందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యాడో పూర్తి రివ్యూలో చూద్దాం..

Samajavaragamana Movie: సామజవరగమన మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే
Samajavaragamana Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jun 28, 2023 | 10:38 PM

Share

మూవీ రివ్యూ: సామజవరగమన నటీనటులు: శ్రీవిష్ణు, నరేష్ వీకే, రెబ్బా జాన్, సుదర్శన్, వెన్నెల కిషోర్, ప్రియా, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఎడిటర్: చోటా కె ప్రసాద్ సినిమాటోగ్రఫర్: రామ్ రెడ్డి సంగీతం: గోపి సుందర్ దర్శకుడు: రామ్ అబ్బరాజు నిర్మాతలు: రాజేష్ దండ, అనిల్ సుంకర

ఎప్పుడు సీరియస్ సినిమాలతో వచ్చే శ్రీ విష్ణు ఈసారి ట్రాక్ మార్చి పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సామజవరగమన అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేశాడు. మరి ఇందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యాడో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఇవి కూడా చదవండి

బాలసుబ్రమణ్యం (శ్రీవిష్ణు) ఏషియన్ సినిమా థియేటర్లో టికెట్స్ ఇచ్చే జాబ్ చేస్తుంటాడు. ఆయన జీతం మీదే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. వందల కోట్ల ఆస్తి ఉన్న బాలు తండ్రి (నరేష్) డిగ్రీ పాస్కాని కారణంగా అవేవీ వాళ్లకు రావు. మరోవైపు ప్రేమకు దూరంగా ఉంటూ తనకు ఐ లవ్ యు చెప్పిన అమ్మాయిలతో రాఖీ కట్టించుకునే బాలు సరయు (రెబ్బా జాన్) తో అనుకోని పరిస్థితుల్లో ప్రేమలో పడతాడు. కానీ సరయు తండ్రికి ప్రేమ పెళ్లి అంటే అసలు పడదు. మరి ఈ సందర్భంలో బాలు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేది మిగిలిన కథ..

కథనం:

కడుపులు చెక్కలయ్యేలా.. సీట్ల మీద నుంచి ఎగిరిపడేలా.. హాయిగా నవ్వుకునే సినిమా చూసి ఎన్నేళ్లయిందో..! ఇన్నాళ్ళకు ఆ లోటు సామజవరగమన తీర్చింది. టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డు పడేంత వరకు కడుపునొప్పి వచ్చేలా నవ్వించింది ఈ సినిమా. తీసింది రొటీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా.. ఇందులో ఒక కొత్త పాయింట్ గురించి చర్చించాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. అదేంటో చెప్తే ఆ ఫీల్ మిస్ అవుతారు.. థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిందే. ఇంటర్వెల్ వరకు బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతుంది సామజవరగమన. సెకండాఫ్ కూడా మెయిన్ స్టోరీ రన్ చేస్తూనే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వదిలిపెట్టలేదు దర్శకుడు. ఇక వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత కామెడీ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. కులమనే సున్నితమైన అంశాన్ని తీసుకొని ఎవరిని నొప్పించకుండా ఇవ్వాల్సిన వినోదం.. చెప్పాల్సిన సందేశం రెండు కలిపి అద్భుతంగా చెప్పాడు. ఒక పంచ్ విని నవ్వేలోపు మరో రెండు మూడు పంచులు మిస్ అయిపోతాయి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ పై పంచ్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ మధ్య కాలంలో ఇంత హీలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఏ సినిమాలో రాలేదు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ ఐతే గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది. పర్ఫెక్ట్ ఎమోషన్స్.. ఫస్ట్ క్లాస్ ఎంటర్టైన్మెంట్.. కావాల్సిన కమర్షియల్ అంశాలు.. ఇలా అన్నీ ఒకే సినిమాలో కుదరడం చాలా రేర్.. అది సామజవరగమనకు కుదిరింది.

నటీనటులు:

శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ అదిరింది.. మనోడి డైలాగ్ డెలివరీకే కడుపులు చెక్కలైపోతాయి. ఫస్ట్ హాఫ్ లో చెప్పే సింగిల్ టేక్ డైలాగ్ అదుర్స్. ఈ సినిమాకు నరేష్ మరో హీరో.. ఫస్టాఫ్ అయితే ఆయన సీన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో సుదర్శన్ కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ రెబ్బా జాన్ స్క్రీన్ మీద అందంగా ఉంది. వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపైనా కూడా ఆయన క్యారెక్టర్ బాగా పేలింది. మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నికల్ టీమ్:

సంగీత దర్శకుడు గోపి సుందర్ పాటలపరంగా నిరాశపరిచినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కు పేరు పెట్టడానికి లేదు. నందు రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. దర్శకుడు రామ్ అబ్బరాజు రొటీన్ కథ తీసుకున్నా కూడా హిలేరియాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా సామజవరగమన.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. డోన్ట్ మిస్..