శ్రీకాంత్‌కు భార్య, వదినగా నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే
హీరో శ్రీకాంత్ క్రేజ్ గురించి తెలిసిందే. ఒకప్పుడు జగపతి బాబు తర్వాత ఆ స్థాయిలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో సహయ నటుడిగా కనిపిస్తూ బిజీగా ఉంటున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శ్రీకాంత్

చాలా మంది సీనియర్ హీరోలు ఇప్పుడు విలన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. కొందరు సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో శ్రీకాంత్ ఒకరు. విలన్ గా, హీరోగా, ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు శ్రీకాంత్. దాదాపు 125 చిత్రాల్లో నటించి మెప్పించారు ఈ స్టార్ హీరో. వన్ బై టు సినిమాతో హీరోగా మారిన శ్రీకాంత్.. ఆ తర్వాత తాజ్ మహల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో కట్టిపడేశారు. అప్పట్లో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన శ్రీకాంత్.. ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో సహయ నటుడిగా అలరిస్తున్నారు. అయితే శ్రీకాంత్ కెరీర్ లో భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ గురించి మీకు తెలుసా.? అవును ఓ ముద్దుగుమ్మ శ్రీకాంత్ కు భార్యగా, అలాగే ఓ సినిమాలో వదినగా కూడా నటించింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.
తెలుగు ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. ఆమె ఎవరో కాదు.. అందాల భామ స్నేహ. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది స్నేహ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే శ్రీకాంత్, స్నేహ జోడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.కాగా శ్రీకాంత్ భార్యగా కనిపించిన స్నేహ.. మరో చిత్రంలో వదినగా కూడా నటించింది.
2005లో డైరెక్టర్ దిగ్గజ దర్శకుడు బాపు తెరకెక్కించిన రాధా గోపాలం సినిమాలో శ్రీకాంత్, స్నేహ భార్యభర్తలుగా కనిపించారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతి సినిమాలోనూ వీరిద్దరు నటించారు. అయితే ఇందులో స్నేహ వెంకటేశ్ భార్యగా నటించగా.. శ్రీకాంత్ వెంకటేష్ తమ్ముడిగా కనిపించారు. అంటే సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ వదినగా స్నేహ నటించింది. చాలా కాలం హీరోయిన్ గా నటించిన స్నేహ. ఇప్పుడు అక్క, వదిన పాత్రలు పోషిస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
