Gold Prices: బంగారం ధరలపై గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా కుప్పకూలిన ధరలు.. రాత్రికి రాత్రి డౌన్.. ఎంత తగ్గాయంటే..?
బంగారం ధర ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ధరలు కుప్పకూలాయి. గత వారంలో గోల్డ్ రేట్లు పెరగ్గా.. ఈ వారంలో కూడా మొన్నటివరకు పెరుగుతూ వచ్చాయి. శుక్రవారం స్వల్పంగా ధరలు తగ్గాయి. శుక్రవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే

బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. మొన్నటివరకు వరుసగా గోల్డ్ రేట్లు పెరుగుతూ వస్తోండగా.. ఇప్పుడు ఢమాల్ అంటూ పడిపోయాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. సోమవారం నుంచి ధరలు భారీగా పెరుగుతూ వస్తోండగా.. శుక్రవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల క్రితం బంగారం ధర ఒకేసారి రూ.6 వేలు పెరగ్గా.. గురువారం స్వల్పంగా తగ్గింది. శుక్రవారం మరికొంత తగ్గింది. ఈ పరిణామం తర్వాత వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు ఇలా..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,300 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.1,54,310గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.10 మేర తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల గోల్డ్ గురువారం రూ.1,41,450గా ఉండగా.. నేడు రూ.1,41,440కి తగ్గింది
-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ బంగారం ధర రూ.1,54,300గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,440 వద్ద స్థిరపడింది
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,54,910గా ఉంది. 22 క్యారెట్ల విషయానికొస్తే నిన్న రూ.1,42,000గా ఉండగా.. శుక్రవారానికి రూ.1,41,990కి చేరుకుంది
-బెంగళూరులో 24 క్యారెట్లు రూ.1,54,300 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,440 వద్ద స్థిరపడింది
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,450 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. గురువారం ఇది రూ.1,54,460 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల ధర రూ.1,41,590 వద్ద కొనసాగుతోంది
నేటి వెండి ధరలు
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,24,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.3,25,000 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.100 తగ్గింది
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,39,900 వద్ద కొనసాగుతోంది. గురువారం దీని ధర రూ.3,40,000 వద్ద స్ధిరపడింది
-చెన్నైలో కేజీ వెండి రేటు రూ.3,39,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.3,40,000 వద్ద స్ధిరపడింది
బెంగళూరులో కేజీ వెండి ధర రూ.3,24,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.3,25,000గా ఉంది
