AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: తన తమ్ముళ్ళతో కలిసి డ్యాన్స్ చేసిన సల్మాన్ ఖాన్ .. వీడియో సోషల్ మీడియాలో హల్ చల్

Salman Khan dancing Video: బాలీవుడ్ కండల హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ ఏ పండగైనా ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తాడు. తన ఇంట్లో జరిగే పండగలకు, ఫంక్షన్లకు తోటి..

Salman Khan: తన తమ్ముళ్ళతో కలిసి డ్యాన్స్ చేసిన సల్మాన్ ఖాన్ .. వీడియో సోషల్ మీడియాలో హల్ చల్
Salman Khan1
Surya Kala
|

Updated on: Jun 28, 2021 | 1:12 PM

Share

Salman Khan dancing Video: బాలీవుడ్ కండల హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ ఏ పండగైనా ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తాడు. తన ఇంట్లో జరిగే పండగలకు, ఫంక్షన్లకు తోటి నటీనటులను పిలిచి భారీగానే జరుపుతాడు అన్న సంగతి తెలిసిందే.. అలాగతంలో తన సోదరులతో కలిసి క్రిస్మస్ పార్టీలో చేసిన హంగామా వీడియో ఒకటి సోషల్ మీడియాలో మళ్ళీ హల్ చల్ చేస్తోంది.

సల్మాన్ ఖాన్ 2018 న ఇచ్చిన క్రిస్మస్ పార్టీలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఆ పార్టీలో సల్మాన్ ఖాన్ తన సోదరులు అర్బాజ్ ఖాన్ మరియు సోహైల్ ఖాన్ కలిసి నృత్యం చేస్తున్న త్రోబాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు సోదరులు కలిసి వేసిన షేకింగ్ డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ తరచూ తనకు నచ్చిన ఫోటోలు వీడియోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటాడు. తన ఆనందాన్ని అందరితోనూ సల్మాన్ ఖాన్ పంచుకుంటాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ 2018 క్రిస్మస్ పార్టీ లోని ఓ పాత వీడియోను ఇప్పుడు షేర్ చేశాడు. ఈ వీడియోలో, ముగ్గురు సోదరులు డ్యాన్స్ చేస్తున్నారు. సోహైల్ నీలిరంగు టీ-షర్టు, జీన్స్ ధరించగా, అర్బాజ్ ఖాన్ చెక్స్ షర్టును ధరించాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ చారల టీ షర్టు ధరించి డెనిమ్‌తో హ్యాండ్సమ్ లుక్ లో కనిపించాడు. కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా గడుపుతున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. దీనిని ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. వారి ఆనందాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ముందు సల్మాన్ ఖాన్ సోదర త్రయం డ్యాన్స్ చేస్తుంటే.. తర్వాత సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ ఆ ముగ్గురు సోదరులతో జతకలిశాడు. వారితో డ్యాన్స్ ఫ్లోర్‌లో చేరాడు.ఈ క్రిస్మస్ పార్టీకి కరణ్ జోహార్, అతని కవలలు రూహి, యష్, షారూఖ్ ఖాన్ కుమారుడు అబ్రామ్, కత్రినా కైఫ్, తుషార్ కపూర్, అతని కుమారుడు లక్ష్యా, అమృత అరోరాలతో పాటు పలువురు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ ఇటీవలే రాధే .. యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ త్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Also Read: 9 పగళ్లు, 8 రాత్రులతో వైష్ణవి దేవి సహా ఉత్తర భారతదేశ యాత్రకు షెడ్యూల్ రిలీజ్ చేసిన రైల్వేశాఖ