Shahid Kapoor : డిజిటల్ ఎంట్రీ అంటే భయమేస్తుందంటున్న బాలీవుడ్ స్టార్ హీరో.. కారణం ఇదేనట..
కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టే ప్రేక్షకుల సంఖ్య ఎక్కవైంది. థియేటర్లకు వెళ్లలేకనో.. థియేటర్ వెళ్లే అలవాటు తప్పో.. అసలు థియేటర్‌కు ఎందుకు వెళ్లాలనే ఆలోచనతోనో... డబ్బు సేవింగ్‌తోనో.. కరోనా భయంతోనో... మాక్సిమమ్ అందరూ ఓటీటీ వైపే మళ్లుతున్నారు.
Shahid Kapoor :
కరోనా కారణంగా ఓటీటీ బాట పట్టే ప్రేక్షకుల సంఖ్య ఎక్కవైంది. థియేటర్లకు వెళ్లలేకనో.. థియేటర్ వెళ్లే అలవాటు తప్పో.. అసలు థియేటర్‌కు ఎందుకు వెళ్లాలనే ఆలోచనతోనో… డబ్బు సేవింగ్‌తోనో.. కరోనా భయంతోనో… మాక్సిమమ్ అందరూ ఓటీటీ వైపే మళ్లుతున్నారు. కాస్త ఖర్చైనా పర్లేదు కాని అవసరం అయితే థియేటర్ సెటప్‌నే ఏర్పాటు చేసుకుంటూ… థియేటర్ అనుభూతిని..ఇంట్లోనే పొందుతున్నారు…. ప్రతీ కంటెంట్‌ను ఆదరిస్తున్నారు… హిట్ చేస్తున్నారు. ఇలా జనాల.. అభిరుచిని.. క్యాష్ చేసుకునేందుకు సెలబ్రిటీలు కూడా ఓటీటీ అంటే మక్కవ చూపిస్తున్నారు. ఇప్పటికే హీరోలు, హీరోలయిన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అని తేడా లేకుండా ఓటీటీ సిరీస్‌లలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు షాహిద్ కపూర్. అవును తాజాగా డిజిటల్ ఎంట్రీకి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సిద్ధమవుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్స్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా షాహిద్ కబీర్ సింగ్ మూవీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో అతడు తన ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన డిజిటల్ ఎంట్రీ పై స్పందించారు. ఓ అభిమాని తన ఓటీటీ ఎంట్రీపై ప్రశ్నించగా.. రాజ్, డీకేలతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయడం సంతోషంగా ఉన్నా అదే సమయంలో చాలా భయంగా కూడా ఉందంటూ సమాధానమిచ్చాడు షాహిద్ కపూర్. “డిజిటల్ ఎంట్రీపై భయపడుతున్న.. ఎందుకంటే.. బిగ్ స్క్రీన్ ప్రేక్షకుల ప్రేమ అందుకున్న ప్రతి నటీనటులంతా ఓటీటీలో వారి ప్రశంసలు అందుకోవచ్చు లేదా అందుకోకపోవచ్చు. సినిమాల్లో వచ్చిన సక్సెస్ ఓటీటీలో రావచ్చు.. రాకపోవచ్చు. సినిమాలకు అక్కడ ఆదరణ ఉంటుందన్న గ్యారంటీ లేదు” అంటూ వివరణ ఇచ్చారు షాహిద్ కపూర్. “ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసిన డైరెక్టర్స్ తో నా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారు నాకు కథ వివరించగానే నచ్చి ఒకే చెప్పాను. ఆ కథతో త్వరలోనే ముందుకు వస్తాను. కానీ అప్పటివరకు వెయిట్ చేయలేకపోతున్న” అంటూ రాజ్, డీకేలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు షాహిద్ కపూర్.
మరిన్ని ఇక్కడ చదవండి :