తెరపైకి మరో క్రేజీ కాంబో.. ప్రభాస్‌ను ఢీ కొట్టబోతున్న సేతుపతి.? నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే..

తెరపైకి మరో క్రేజీ కాంబో.. ప్రభాస్‌ను ఢీ కొట్టబోతున్న సేతుపతి.? నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే..

Salaar Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులకు అలరించడానికి సిద్దమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్...

Ravi Kiran

|

Jan 21, 2021 | 10:20 PM

Salaar Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులకు అలరించడానికి సిద్దమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన డార్లింగ్. సలార్ సినిమాను కూడా మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకుంది. అంతకు ముందు రిలీజ్ అయిన సలార్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేజీఎఫ్ సినిమాతో సంచలన హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్రలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. అటు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో సైతం దర్శకుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు ఈ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటాని నటించనుందని సమాచారం.

Also Read:

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల..

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!

ఐపీఎల్ 2021: వేలంలోకి స్మిత్, మ్యాక్స్‌వెల్, హర్భజన్.. ఫ్రాంచైజీల వారీగా రిలీజ్/రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu