Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!
Ayodhya Ram Mandir: ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది....

Ayodhya Ram Mandir: ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అలాగే మరోవైపు రామ మందిర నిర్మాణ కోసం చేపట్టిన విరాళాల సేకరణకు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. సామాన్యులు మొదలు, ప్రముఖుల వరకు భారీ స్థాయిలో విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇక ఇప్పటికే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తమ వంతు విరాళాన్ని అందజేశారు.
తనను కలిసేందుకు డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన బీజేపీ నేత రఘుకు రూ. 10,000 అందించారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోట్ల మంది ఆకాంక్ష అంటూ డీజీపీ సవాంగ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా, నిన్న రఘుతో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు డీజీపీని కలుసుకున్నారు.