చిత్తూరు జిల్లాలో ఢిల్లీ బాబు ఆత్మహత్య.. పెనుమూరు అడవుల్లో చెట్టుకు ఉరేసుకొని..

చిత్తూరు జిల్లాలో ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా

  • uppula Raju
  • Publish Date - 2:14 pm, Wed, 20 January 21
చిత్తూరు జిల్లాలో ఢిల్లీ బాబు ఆత్మహత్య.. పెనుమూరు అడవుల్లో చెట్టుకు ఉరేసుకొని..

Delhi Babu Suicide: చిత్తూరు జిల్లాలో ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ బాబు చిత్తూరు జిల్లా పెనుమూరు అడవుల్లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు, గాయత్రి అనే ప్రేమజంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికి గాయత్రి మైనర్‌ కావడంతో ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీంతో అప్పటినుంచి గాయత్రి.. ప్రియుడు ఢిల్లీబాబును దూరం పెడుతూ వచ్చింది. ఇది జీర్జించుకోలేని యువకుడు  మంగళవారం ప్రియురాలిపై కత్తితో 15 సార్లు పొడిచి హత్య చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఢిల్లీబాబు తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.