Salaar: వేగం పెంచిన ప్రశాంత్ నీల్.. శరవేగంగా సలార్ షూటింగ్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే..
Salaar: కేజీఎఫ్ (KGF)తో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సలార్. ఈ సినిమా గురంచి ప్రకటన వచ్చిన నాటి నుంచి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి...
Salaar: కేజీఎఫ్ (KGF)తో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సలార్. ఈ సినిమా గురంచి ప్రకటన వచ్చిన నాటి నుంచి చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇండస్ట్రీ రికార్డులు బద్దులు అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇందుకు తగ్గుట్లుగానే ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు. మొన్నటి వరకు కేజీఎఫ్ సీక్వెల్ విడుదల నేపథ్యంలో కాస్త నెమ్మదించిన సలార్ షూటింగ్ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరాశకు గురైన ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది.
సలార్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు తెలియజేసేందుకు గాను అధికారికంగా ట్విట్టర్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా సినిమా సెట్స్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. సీన్ ఎలా ఉండాలి.. దానికి సంబంధించిన షాట్ డివిజన్ గురించి ప్రశాంత్ నీల్ ఆర్ట్ డైరక్టర్‌తో చర్చిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే సలార్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. సలార్ చిత్ర షూటింగ్ మొదలై ఏడాది దాటుతోన్నా ఇప్పటికే 40 శాతం టాకీ పార్ట్ మాత్రమే కావడంతో చిత్రీకరణలో వేగాన్ని పెంచి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో పడింది చిత్ర యూనిట్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..