Parasuram : నేను ఎంత కష్టపడ్డానో మహేష్ గారికి తెలుసు.. పరశురామ్ ఆసక్తికర కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట. సూపర్ హిట్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా

Parasuram : నేను ఎంత కష్టపడ్డానో మహేష్ గారికి తెలుసు.. పరశురామ్ ఆసక్తికర కామెంట్స్
Sarkaru Vaari Paata
Follow us

|

Updated on: May 19, 2022 | 8:00 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). సూపర్ హిట్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ మీడియాతో ముచ్చటించారు. ‘సర్కారు వారి పాట’ కథ అనుకున్నప్పుడే మహేష్ బాబు గారి కెరీర్ లో పెద్ద హిట్ అవ్వాలని భావించాం. దానికి తగ్గట్టే క్యారెక్టర్, మేనరిజమ్స్, లుక్స్ డిజైన్ చేశాం. మేము ఊహించినట్లే సినిమా ఘన విజయం సాధించింది అన్నారు పరశురామ్. కొత్త మహేష్ బాబుని చూస్తున్నామనే ఫీడ్ బ్యాక్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వచ్చింది. సినిమా ఇంతపెద్ద ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది. రిలీజ్ రోజు మార్నింగ్ మహేష్ బాబు గారు కాల్ చేసి.. ”అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. కంగ్రాట్స్”అని ఆయనే రివర్స్ లో కంగ్రాట్స్ చెప్పారు. నేను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డానో మహేష్ గారికి తెలుసు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం ఆనందంగా వుంది.

అలాగే దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, పూరి గారు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ”నేను అయితే ఇంతహెవీ కథని ఇంత లైటర్ వెయిన్ లో వినోదాత్మకంగా ట్రీట్ చేయలేను. ఇది నీ ఒక్కడికే సాధ్యం” అని సుకుమార్ అన్నారు. స్పెషల్ గా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ దగ్గర నుండి భారీ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ ఫోన్ చేసి” మహేష్ బాబు గారిని ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు. అద్భుతంగా చూపించారు”అని ఆనందపడ్డారు. థియేటర్ లోకి వచ్చిన వారిని ఆహ్లాదపరుస్తూ చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడం నాకు ఇష్టమైన స్టైల్. ప్రేక్షకులు నవ్వాలి. ఆనందంగా వుండాలి. మనం చెప్పాలనుకున్న పాయింట్ కూడా చెప్పాలి. ఇదే నాకిష్టం. సర్కారు వారి పాటకు రిపీట్ ఆడియన్స్ రావడానికి కారణం కూడా సినిమాలో వున్న వినోదమే. సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం సెకండ్ కిక్. మహేష్ గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం థర్డ్ కిక్. ఇక బాక్సాఫీసు నెంబర్లు అంటే అది మహేష్ గారికి వున్న స్టార్ డమ్.. కథ జనాల్లోకి చొచ్చుకు వెళ్ళడం.. రెండో వారం వస్తుంది.. ఇప్పటికీ అద్భుమైన షేర్స్ లో వుంది సర్కారు వారి పాట అంటూ చెప్పుకొచ్చారు పరశురామ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

F3 Movie: ఊపేసిన అనిల్‌ రావిపూడి.. పార్టీ సాంగ్‌తో తనదైన స్టెప్పులతో..

Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న ‘ఓ ఇషా’ రొమాంటిక్‌ సాంగ్‌..

Deepika Pilli: ట్రెండీ వేర్ లో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న దీపికా పిల్లి లేటెస్ట్ పిక్స్

‘మేఘా‘ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం.. బన్సీలాల్‌పేట్‌లో..
‘మేఘా‘ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం.. బన్సీలాల్‌పేట్‌లో..
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్