Karthikeya: అభిమానులందరి సమక్షంలో అమ్మాయికి ప్రపోజ్‌ చేసిన ఆర్‌ఎక్స్‌ 100 హీరో.. ఎమోషనల్‌ అయిన లోహిత..

Karthikeya: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో కార్తికేయ. నిజానికి అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా.. ఆర్‌ఎక్స్‌ 100తో..

Karthikeya: అభిమానులందరి సమక్షంలో అమ్మాయికి ప్రపోజ్‌ చేసిన ఆర్‌ఎక్స్‌ 100 హీరో.. ఎమోషనల్‌ అయిన లోహిత..
Karthikeya Prapose
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 07, 2021 | 10:23 AM

Karthikeya: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో కార్తికేయ. నిజానికి అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా.. ఆర్‌ఎక్స్‌ 100తో ఒక్కసారిగా భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో తనదైన నటనతో చిత్రం సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను నవంబర్‌ 12న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచిన చిత్ర యూనిట్‌ తాజాగా శనివారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే కార్తికేయ తన వ్యక్తిగత జీవితానికి చెందిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

తనకు కాబోయే భార్యను అందరికీ పరిచయం చేశాడు. స్టేజ్‌పైనే కాళ్లపై కూర్చొని ప్రపోజ్‌ చేశాడు. నవంబర్ 21న వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపిన కార్తికేయ, కాబోయే భార్యను స్టేజ్‌పైకి పిలిచి అందరికి పరిచయం చేశాడు. ఇదిలా ఉంటే కార్తికేయకు కాబోయే భార్య పేరు లోహిత. చదువుకునే రోజుల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. తనకు కాబోయే భార్యను పరిచయం చేసిన సందర్భంలో కార్తికేయ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా.

అప్పుడే తనకి నేను హీరో అవుదామని అనుకుంటున్నానని చెప్పి, హీరో అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతా’నని చెప్పా. నేను హీరో అయ్యి… చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా. ఈ నెల 21న నా పెళ్లి’ అని చెప్పుకొచ్చాడు. ఇక కార్తికేయ మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్‌ చేయగానే లోహిత ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. ఒకింత కంటతడి పెట్టుకున్నారు. దీంతో వేడకకు హాజరైన వారంతా ఈ సన్నివేశాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు.

Karthikeya

Also Read: IIT Recruitment: ఐఐటీ మండిలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తుచేసుకోవాలి.?

India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ