సుప్రీమ్ హీరోకు జోడిగా నాని హీరోయిన్!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రెజీనా కసాండ్రను ఎంపిక చేశారని సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘ప్రతీ రోజు పండగే’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వినికిడి. ఇది ఇలా ఉండగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర […]

సుప్రీమ్ హీరోకు జోడిగా నాని హీరోయిన్!
Ravi Kiran

|

Jun 12, 2019 | 8:05 PM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రెజీనా కసాండ్రను ఎంపిక చేశారని సమాచారం. ఇక ఈ చిత్రానికి ‘ప్రతీ రోజు పండగే’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వినికిడి. ఇది ఇలా ఉండగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం ‘ఏబీసీడీ’ ఫేమ్ రుక్సార్ దిల్లోన్‌ను ఫైనలైజ్ చేయాలని చూస్తున్నారట. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu