బ్రేకింగ్: హీరో వరుణ్ తేజ్‌కు యాక్సిడెంట్
హీరో వరుణ్ తేజ్ మైనర్ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయని పేట స్టేజీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే దీనికి కారణం అని కొత్తకోట సిఐ తెలిపారు. ముందున్న మరో రెండు కార్లను బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వరుణ్ తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ యాక్సిడెంట్లో మరో […]
హీరో వరుణ్ తేజ్ మైనర్ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయని పేట స్టేజీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే దీనికి కారణం అని కొత్తకోట సిఐ తెలిపారు. ముందున్న మరో రెండు కార్లను బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో వరుణ్ తేజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ యాక్సిడెంట్లో మరో ఇద్దరు వ్కక్తులు గాయపడ్డట్టు తెలుస్తోంది.
వాల్మీకి షూటింగ్ కర్నూలు పరిసర ప్రాంతాలతో జరుగుతుండటంతో.. అక్కడికే తన కార్లో బయల్దేరాడు వరుణ్ తేజ్. కాగా మెగా హీరోకు యాక్సిడెంట్ కావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వరుణ్ తేజ్ చిన్నపాటి గాయాలతోనే బయటపడ్డారు. కార్ ధ్వంసమైనా కూడా హీరోకు ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది మెగా కుటుంబం. ఈ మధ్యే ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.