RRR Shooting resume: టాలీవుడ్ యువ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ చిత్రీకరణను ప్రారంభించేశారు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో.. మార్చి వరకు ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ బాగా జరిగిందని, కరోనాతో బ్రేక్ పడగా.. ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్న ఆయుధాలు, వెహికల్స్‌ని ఆ వీడియోలో చూపించారు. వాటితో పాటు సెట్స్‌లో జాగ్రత్తలు పాటిస్తున్నామంటూ చెప్పే ప్రయత్నం చేసిన రాజమౌళి.. చివరగా హీరోలను యాక్షన్ అంటూ పిలిచేశారు.
ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రామరాజు ఫర్ భీమ్ స్పెషల్ టీజర్ ఈ నెల 22న విడుదల కాబోతున్నట్లు వెల్లడించింది. మరోవైపు షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు చాలా ఉత్సాహంగా ఉందంటూ కామెంట్ పెట్టారు.
కాగా నిజ జీవిత పాత్రలతో ఫిక్షన్ కథాంశంతో ఆర్‌ఆర్‌ఆర్ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇక చెర్రీ సరసన అలియా, ఎన్టీఆర్ సరసన ఒలివియా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read More:
షూటింగ్ స్టార్ట్ చేసిన నాని..!
గ్రామాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు.. నిధుల విడుదలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు
Rested✊🏻Recharged🔥Raring to go🌊
And that’s how #WeRRRBack!! 🤞🏻https://t.co/h8niWpdmpo @tarak9999 @AlwaysRamCharan @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @dvvmovies #RRRMovie #RRR
— RRR Movie (@RRRMovie) October 6, 2020