AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన నాని..!

టాలీవుడ్‌లో మూవీ షూటింగ్‌లు మళ్లీ మొదలయ్యాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్‌ నెలలోనే సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ

షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన నాని..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2020 | 12:05 PM

Share

Nani Tuck Jagadish: టాలీవుడ్‌లో మూవీ షూటింగ్‌లు మళ్లీ మొదలయ్యాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్‌ నెలలోనే సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ఒకరు, ఇద్దరు మినహా ఎవ్వరూ సెట్స్‌పైకి వెళ్లే సాహసం చేయలేదు. అయితే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య తగ్గుతుండటం, రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో.. నిదానంగా ఒక్కొక్కరు సెట్స్ మీదకు వెళుతున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌ తదితరులు ఇప్పటికే షూటింగ్‌లను ప్రారంభించేశారు. భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని కూడా సెట్స్‌పైకి వెళ్లారు.

లాక్‌డౌన్ ముందు నాని, శివ నిర్వాణ దర్శకత్వంలో టక్‌ జగదీష్‌లో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్నారట నాని. ఈ షెడ్యూల్ ముగిసిన తరువాత ఏపీలోని తూర్పు గోదావరికి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇటీవల నాని నటించిన ‘వి’ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాగా.. మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో టక్ జగదీష్‌తో మళ్లీ పెద్ద విజయాన్ని సాధించాలని నాని భావిస్తున్నారు.

Read More:

గ్రామాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు.. నిధుల విడుదలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు

ఖమ్మంలో ‘దిశ’ ఘటన.. మృత్యువుతో పోరాటం చేస్తోన్న మైనర్ బాలిక

Follow Us
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
ప్రతిరోజూ కేవలం 6 నిమిషాలు ఏదైనా పుస్తకం చదవండి..! ఇది మీ శరీరం,
ప్రతిరోజూ కేవలం 6 నిమిషాలు ఏదైనా పుస్తకం చదవండి..! ఇది మీ శరీరం,
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌
ఇలాంటివి ఎదురైన‌ప్పుడు అక్క‌డి నుంచి వెళ్ళిపోండి
ఇలాంటివి ఎదురైన‌ప్పుడు అక్క‌డి నుంచి వెళ్ళిపోండి