AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: ఆ లక్షణం ఉంటే ఏ సినిమా అయినా సరిహద్దులు చెరిపేయగలదు.. పాన్‌ ఇండియా సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌.

Rajamouli: రాజమౌళి.. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. బాహుబలి (Bahubali) సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు ఈ అగ్ర దర్శకుడు. సినిమాకు భాష, ప్రాంతంతో సంబంధం లేదని చాటి చెప్పారు. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ఒక శిల్పాన్ని చెక్కినట్లు..

Rajamouli: ఆ లక్షణం ఉంటే ఏ సినిమా అయినా సరిహద్దులు చెరిపేయగలదు.. పాన్‌ ఇండియా సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌.
Narender Vaitla
|

Updated on: Mar 21, 2022 | 8:54 AM

Share

Rajamouli: రాజమౌళి.. ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. బాహుబలి (Bahubali) సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు ఈ అగ్ర దర్శకుడు. సినిమాకు భాష, ప్రాంతంతో సంబంధం లేదని చాటి చెప్పారు. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతారు కాబట్టే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)తో మరోసారి మ్యాజిక్‌ చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అదే స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. పాన్‌ ఇండియా సినిమాకు అసలైన అర్థం చెబుతూ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌ను ఉరకలెత్తిస్తున్నారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయని విధంగా ట్రిపుల్‌ఆర్‌కు ప్రమోషన్‌ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే రాజమౌళి తన టీమ్‌తో కలిసి దేశ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమీర్‌ ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా సినిమాకు ఉండాల్సిన లక్షణం ఏంటో చెప్పుకొచ్చారు జక్కన్న. ఏ సినిమాలో అయినా ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషన్‌ ఉంటే అది కచ్చితంగా భాష, ప్రాంతం అనే సరిహద్దులను చెరిపేయగలదని రాజమౌళి అన్నారు.

ఎమోషన్‌కు భాష, ప్రాంతం అనే తేడాలు ఉండవని జక్కన్న అభిప్రాయపడ్డారు. ఇక ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘లగాన్‌’ సినిమా గురించి ప్రస్తావించిన జక్కన్న.. లగాన్‌ సినిమా దక్షిణాది, ఉత్తరాది అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుందని, ఆ స్ఫూర్తితోనే పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాలను తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి చెప్పినట్లుగానే ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లో ఎమోషన్ కు పెద్దపీట వేశారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జక్కన్న ప్రతీ సినిమాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఉండేలా చూసుకుంటారు. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదేనంటూ చాలాసార్లు రాజమౌళినే స్వయంగా తెలిపారు కూడా.

Also Read: EPFO News: కొత్తగా ఉద్యోగుల్లో ఆ వయసు వారే ఎక్కువ.. రుజువుచేస్తున్న ఈపీఎఫ్‌ఓ జనవరి గణాంకాలు..

TTD News: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఏప్రిల్‌ కోటా ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల..

Snakes really take revenge: పడతిపై పగబట్టిన పాము… ఏడు నెలల్లో.. మూడు సార్లు కాటు.. ఎందుకో తెలిస్తే.. (వీడియో)