RRR Movie: సుమను చూడగానే ఆ గయ్యాలీ పాత్రలే గుర్తొస్తాయి.. తారక్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

బాహుబలి సిరీస్‌ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోలుగా నటిస్తున్నారు.

RRR Movie: సుమను చూడగానే ఆ గయ్యాలీ పాత్రలే గుర్తొస్తాయి.. తారక్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Jr Ntr And Suma
Follow us
Basha Shek

|

Updated on: Mar 21, 2022 | 9:00 AM

బాహుబలి సిరీస్‌ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR), మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ అందగత్తె ఒలివియా మోరీస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియా శరణ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో పాన్‌ ఇండియా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. వరుసగా ప్రెస్‌మీట్‌లు, ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అలా తాజాగా తారక్‌, రామ్‌చరణ్‌లను ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి (MM Keeravani) ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా హీరోలిద్దరూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

ఆ సింగర్ గొంతు చాలా బాగుంటుంది..

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఘరానా బుల్లోడు సినిమాలోని ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా.. మురిపాలు కావాలా’ సాంగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కీరవాణి స్వరపరచిన ఈ సాంగ్ ఎన్టీఆర్‌కు అసలు నచ్చదట. అదేవిధంగా ఇష్టమైన సింగర్‌ ఎవరన్న ప్రశ్నకు గానూ.. బుల్లెట్‌ బండి ఫేం మోహన భోగరాజు పేరు చెప్పాడు. గీతామాధురి గొంతు కూడా తనకు నచ్చుతుందన్నాడు. ఇక యాంకర్‌ సుమకు మీ సినిమాల్లో ఏ క్యారెక్టర్‌ ఇస్తారని కీరవాణి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు తారక్‌.. ‘ సుమకు కొంచెం చాదస్తం ఎక్కువ. ఊరికే నోరు పారేసుకుంటుంది. ఆమెను చూడగానే గయ్యాలీ అత్త పాత్రలు గుర్తొస్తాయి. అందుకే సుమకు నాయనమ్మ లేదా అమ్మమ్మ లాంటి ముసలమ్మ పాత్రలను ఇవ్వాలి’ అని సరదాగా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్‌. ఇదే ప్రశ్నను చెర్రీని అడగ్గా.. సుమకు పంచాయతీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్రను ఇవ్వాలన్నాడు. కాగా రామ్‌ చరణ్‌ చెప్పినట్లే ప్రస్తుతం జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటిస్తోంది సుమ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:Rajamouli: ఆ లక్షణం ఉంటే ఏ సినిమా అయినా సరిహద్దులు చెరిపేయగలదు.. పాన్‌ ఇండియా సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌.

Russia-Ukraine War: ఏ క్షణమైనా అణుదాడి.. ఉక్రెయిన్ రాజధానిని చుట్టుముట్టిన రష్యా బలగాలు..(వీడియో)

Viral Video: తోకతో గిటార్‌ వాయిస్తోన్న కుక్క.. మ్యూజిక్‌ బ్యాండ్‌ స్టార్ట్‌ చేద్దామంటోన్న నెటిజన్లు..