AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: సల్మాన్ ని కలిసిన రాజమౌళి.. అసలు మ్యాటరేంటంటే..

టాలీవుడ్‌తో పాటు యావత్‌ చిత్ర పరిశ్రమ దృష్టంతా ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంపైనే ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ...

Rajamouli: సల్మాన్ ని కలిసిన రాజమౌళి.. అసలు మ్యాటరేంటంటే..
Basha Shek
|

Updated on: Nov 20, 2021 | 1:03 PM

Share

టాలీవుడ్‌తో పాటు యావత్‌ చిత్ర పరిశ్రమ దృష్టంతా ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపైనే ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఒలీవియా మోరీస్‌, అలియాభట్‌, శ్రియా శరణ్‌ లాంటి స్టార్స్‌ ఈ సినిమాలో నటిస్తుండడంతో సినీ ప్రియులందరూ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్లు, గ్లింప్స్‌లు, పాటలు అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసే పనిలో ఉంది. అదే సమయంలో సినిమా ప్రమోషన్‌ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నారు రాజమౌళి.

ఈ విషయాన్ని పక్కన పెడితే దర్శకధీరుడు శుక్రవారం బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌ను ప్రత్యేకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలోహల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? వీరి మీటింగ్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి? అనే విషయాలపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. అయితే పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకను రాజ‌మౌళి ముంబయిలో నిర్వహిస్తున్నారని, ఆ వేడుక‌కు స‌ల్మాన్‌ఖాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డానికి వెళ్లారని కొందరు అంటున్నారు. హీరో రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రామ్ చరణ్ నటించిన ‘తుపాన్’ ని సైతం హిందీలో సల్లూభాయ్‌ ప్రమోట్ చేసారు. అయితే చరణ్‌ బదులు రాజమౌళి వెళ్లి ఆహ్వానిస్తేనే మర్యాదగా ఉంటుందని, అందుకే ఈ మీటింగ్‌ జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం కండలవీరుడితో జక్కన్న సినిమా చేయనున్నారని, కథా చర్చల కోసమే కలిశారని అంటున్నారు. మరి ఈ వార్తలపై రాజమౌళి బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read:

Syed Sohel Ryan: చలాకీ తనానికి కేర్ ఆఫ్ అడ్రస్.. ట్రేండింగ్ లుక్స్ తో అఆకట్టుకుంటున్న సోహెల్..(ఫొటోస్)

Surendar Reddy: కరోనా బారిన పడ్డ సురేందర్‌ రెడ్డి.. ఏజెంట్‌ షూటింగ్‌కు అంతరాయం..

Nazriya Nazim New Photos: ఎక్స్‌ప్రెష‌న్ క్వీన్ న‌జ్రియా నయా అందాలు ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఫొటోలు..