AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendar Reddy: కరోనా బారిన పడ్డ సురేందర్‌ రెడ్డి.. ఏజెంట్‌ షూటింగ్‌కు అంతరాయం..

టాలీవుడ్‌లో స్టైలిష్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన సురేందర్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. అఖిల్‌ హీరోగా రూపొందిస్తున్న 'ఏజెంట్‌' ...

Surendar Reddy: కరోనా బారిన పడ్డ సురేందర్‌ రెడ్డి.. ఏజెంట్‌ షూటింగ్‌కు అంతరాయం..
Basha Shek
|

Updated on: Nov 20, 2021 | 12:35 PM

Share

టాలీవుడ్‌లో స్టైలిష్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన సురేందర్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. అఖిల్‌ హీరోగా రూపొందిస్తున్న ‘ఏజెంట్‌’ సినిమా షూటింగ్‌ కోసం అతను ఇటీవల హంగేరీ రాజధాని బుడాపేస్ట్‌ వెళ్లి వచ్చారు. ఈ సమయంలోనే అతనికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. సురేందర్‌కు కరోనా అని తేలడంతో ‘ఏజెంట్’ షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడనుంది. ఇటీవల హంగేరీలో సుమారు రెండు వారాల పాటు అఖిల్‌, మమ్ముట్టిలపై కొన్ని కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరించారు. కాగా సురేందర్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాకే పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ను పూర్తిచేయనున్నట్లు ‘ఏజెంట్‌’ చిత్ర బృందం తెలిపింది.

స్పై థ్రిల్లర్‌ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఏజెంట్‌’లో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. హిప్‌హాస్‌ తమీజా సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే తాజా పరిణామాలతో ‘ఏజెంట్’ మరింత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ‘అతనొక్కడే’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘సైరా’ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సురేందర్‌. ‘ఏజెంట్‌’ పూర్తయిన తర్వాత అతను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తో కలిసి ఒక సినిమాను చేయనున్నాడు.

Also Read:

Mahesh Babu-NTR: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. తారక్‌తో కలిసి సందడి చేయడానికి రెడీ అయ్యిన సూపర్ స్టార్..

Esther Anil : ఎల్లోరా శిల్పంలా హొయలు ఒలకబోస్తున్న దృశ్యం బ్యూటీ..

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే