AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్‌బాస్ 3’లో రియల్ కపుల్ ఎంట్రీ..?

బుల్లితెర సంచలనం ‘బిగ్‌బాస్’  మూడో సీజన్ మరికొన్ని రోజులు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్‌ లిస్ట్‌లో ఎవరెవరుంటారో.? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తిక విషయం ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సీజన్‌లో ఇద్దరు రియల్ లైఫ్ కపుల్‌లను కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో భాగంగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ వితికా శేరులను బిగ్‌బాస్ నిర్వాహకులు కలిసినట్లు సమాచారం. ఇక ఇందులో […]

‘బిగ్‌బాస్ 3’లో రియల్ కపుల్ ఎంట్రీ..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2019 | 5:14 PM

Share

బుల్లితెర సంచలనం ‘బిగ్‌బాస్’  మూడో సీజన్ మరికొన్ని రోజులు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్‌ లిస్ట్‌లో ఎవరెవరుంటారో.? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తిక విషయం ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సీజన్‌లో ఇద్దరు రియల్ లైఫ్ కపుల్‌లను కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో భాగంగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ వితికా శేరులను బిగ్‌బాస్ నిర్వాహకులు కలిసినట్లు సమాచారం. ఇక ఇందులో పాల్గొనేందుకు వారు కూడా ఉత్సహాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ‘హ్యాపీడేస్’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. ఆ తరువాత ‘కొత్త బంగారు లోకం’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ పైన పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. చెప్పుకోదగ్గ హిట్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. 2016లో ‘మిస్టర్ 420’ తరువాత సినిమాలకు దూరం అయ్యాడు. మరోవైపు ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పడ్డానండి ప్రేమలో మరీ’ వంటి చిత్రాల్లో నటించిన వితికా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బిగ్‌బాస్ 3తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్ 3కు నాగార్జున వ్యాఖ్యతగా చేయనున్నారు. జూలై 21న ఈ సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో 14మంది కంటెస్టెంట్‌లు ఉండబోతున్నట్లు సమాచారం.

Follow Us