AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vantalakka Daughter Hima: తండ్రి దగ్గర పెరిగినా తల్లిని గుర్తు చేసే హిమ.. రియల్ లైఫ్ లో కన్నీటిమయమట

వంటలక్క, డాక్టర్ బాబులు తెలుగు లోగిళ్ళలో దూసుకుపోయారు. ఇక వంటలక్క కూతుళ్లుగా నటించిన హిమ, శౌర్యలు కూడా బాగా పాపులర్ అయ్యారు. తల్లిని గుర్తుకు తెచ్చే పాత్రలో నటిస్తున్న హిమకు...

Vantalakka Daughter Hima: తండ్రి దగ్గర పెరిగినా తల్లిని గుర్తు చేసే హిమ.. రియల్ లైఫ్ లో కన్నీటిమయమట
Surya Kala
|

Updated on: Feb 01, 2021 | 1:55 PM

Share
Vantalakka Daughter Hima: సోమవారం నుంచి శనివారం వరకూ సాయంత్రం ఏడున్నర అయ్యిందంటే చాలు సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకూ బుల్లితెర ముందు హాజరవుతున్నారు.. అవును ఆ సమయంలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ కోసం అంతగా ఎదురుచుస్తున్నారు ప్రేక్షకులు. వంటలక్క, డాక్టర్ బాబులు అంతగా తెలుగు లోగిళ్ళలో దూసుకుపోయారు. సౌందర్య, హిమ, శౌర్య, మోనిత, ఆదిత్య నుంచి పనిమనిషి వరకూ ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. అందుకే వెయ్యి ఎపిసోడ్ల సమీపంలోకి వస్తున్నా కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఆదరణ తగ్గలేదు. ఇక రేటింగ్ కూడా ఈ సీరియల్ కు సమీపంలో కూడా మరే సీరియల్ లేదంటే అతిశయోక్తి కాదు..
 
ఇక వంటలక్క కూతుళ్లుగా నటించిన హిమ, శౌర్యలు కూడా బాగా పాపులర్ అయ్యారు. తల్లిని గుర్తుకు తెచ్చే పాత్రలో నటిస్తున్న హిమకు సోషల్ మీడియాలో బాగా ఫాన్ పాలోయింగ్ ఉంది. హిమ అసలు పేరు సహృద.. చిన్నప్పటి నుంచి సీరియల్స్‌ లో నటిస్తూనే ఉంది. అయితే కార్తీక దీపంలో హిమ పాత్ర ఓ రేంజ్‌లో క్రేజ్‌ను తెచ్చింది. అయితే సహృద ఈ పాత్రలో నటించే ముందు చాలా అసంతృప్తితో ఉన్నానని తెలిపింది. తల్లి దగ్గర పెరిగే శౌర్య క్యారెక్టర్ తండ్రిలా అందంగా ఉంటె.. తండ్రి దగ్గర పెరిగే హిమ వంటలక్కలా నల్లగా ఉంటుంది.. ఈ విషయం తెలిసి మొదట్లో తాను చాలా బాధపడినట్లు సహృద తెలిపింది. నటన అంటే ఇష్టం ఉన్నా కెమెరా అంటే ముందు ఆ క్యారెక్టర్లో నటించాలంటే భయమేసిందని చెప్పింది. ముఖ్యంగా నలుపు మేకప్ చూసి చాలా భయపడ్డానని తెలిపింది.. అయితే నిర్మాతకు ఇచ్చిన మాటకు కట్టుబడి క్యారెక్టర్‌లో మేకప్ నచ్చక పోయినా బలవంతంగా నటించానని చెప్పింది చిన్నారి సహృద..
 
అయితే తన పాత్రలో ఉన్న గంభీరత రాను రాను ఆ పాత్ర నచ్చేటట్లు చేసిందని.. కథ కూడా ఎంతో బాగుందని చెప్పింది. అందుకనే ఇప్పుడు ఆ పాత్రలో లీనమై నటిస్తున్నానని తెలిపింది. మేకప్‌ను కూడా ఇష్టంగా వేయించుకుంటానని చెప్పింది అందాల బొమ్మ. తన అమ్మగా నటించిన ప్రేమి విశ్వనాథన్ ఎలా డీ గ్లామర్ రోల్‌లో నటించి ఎంత పేరు తెచ్చుకుందో అర్ధమయ్యిందని … తనను కూడా అలాగే చూపిస్తున్నారని తెలుసుకుని ఇప్పుడు ఎంతో ఇష్టంగా షూటింగ్‌కు వెళ్తానని తెలిపింది సహృద..
సీరియల్ లో తండ్రి నుంచి ఎంతో ప్రేమను పొందిన హిమ రియల్ లైఫ్ లో అందుకు భిన్నం అని తెలుస్తోంది. ఓ స్టేజ్ షోలో తల్లి హిమ గురించి ఎన్నో తెలియని సంగతులు తెలిపారు. నిజానికి సహృద పుట్టిన సమయంలో ఆడపిల్ల పుట్టిందని తండ్రి చూడలేదట. హిమను తల్లి ఎంతో కష్టపడి సహృదను పెంచారు.. తల్లి ఆశలను నిలబెడుతూ.. సహృద తనకంటూ పేరు తెచ్చుకుంది. మరి హిమ రియల్ గా ఎలా ఉంటుందో ఒక్కసారి లుక్ వేయండి.