క్రాక్ మూవీలోని పాట టీజర్ విడుదల.. ఫుల్ ఎనర్జీటిక్ అండ్ మాస్ లుక్‏లో మాస్ మహారాజ రవితేజ..

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలోని ఓ పాట టీజర్‏ను ఇవాళ విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్. ఇందులో మాస్ మహారాజకు జంటగా శ్రుతిహాసన్ నటించనుండగా..

క్రాక్ మూవీలోని పాట టీజర్ విడుదల.. ఫుల్ ఎనర్జీటిక్ అండ్ మాస్ లుక్‏లో మాస్ మహారాజ రవితేజ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 13, 2020 | 1:58 PM

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలోని ఓ పాట టీజర్‏ను ఇవాళ విడుదల చేసింది ఆ చిత్ర యూనిట్. ఇందులో మాస్ మహారాజకు జంటగా శ్రుతిహాసన్ నటించనుండగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. క్రాక్ సినిమాలో రవితేజ పోలీస్ గెటప్‏లో కనిపించనున్నాడు. కాగా సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్ పై బీ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా సమాచారం. ఇటివలే సినిమా షూటింగ్ నిమిత్తం రవితేజ దుబాయ్ వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ రోజు ‘భలేగా ఉన్నవే బంగారం’ అనే మాస్ సాంగ్ టీజర్ విడుదల చేయగా పూర్తిగా మాస్ పిచ్‏లో ఉన్న ఈ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ పాటకు తమన్ సంగీతం అందించగా.. వోకల్స్ అనిరుద్ అందించాడు. ఇద్దరు టాప్ సంగీత దర్శకులు ఈ పాటకు పనిచేయగా ఫుల్ ఎనర్జిటిక్‏లో ఈ సాంగ్ ఉండబోతున్నట్లుగా అభిమానులు అంటున్నారు. రవితేజ నటిస్తున్న ఈ సినిమా విడుదలైతే ఓ రేంజ్‏లో ఉంటుందని మాస్ మాహారాజా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో విడుదల వరకు వేచి చూడాల్సిందే.