Ravi Teja : మాస్ రాజా పుట్టిన రోజుకు సర్ప్రైజ్ ఉంటుందా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

మాస్ మహారాజా చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ సాలిడ్ హిట్ అందుకున్నాడు. రవితేజ నటించిన 'క్రాక్' సినిమా సంచలన వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటి వరకు రవితేజ కెరీర్ లో ఎప్పుడూ లేనంత...

Ravi Teja : మాస్ రాజా పుట్టిన రోజుకు సర్ప్రైజ్ ఉంటుందా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
Follow us
Rajeev Rayala

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 21, 2021 | 10:03 AM

Ravi Teja : మాస్ మహారాజా చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ సాలిడ్ హిట్ అందుకున్నాడు. రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా సంచలన వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటి వరకు రవితేజ కెరీర్ లో ఎప్పుడూ లేనంత భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అది కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఇది సంచలన రికార్డులను క్రియేట్ చేస్తుంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాగా విడుదలైన క్రాక్..  కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది.

ఇదిలా ఉండగా క్రాక్ తర్వాత రవితేజ డైరెక్టర్ రమేష్ వర్మతో మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ‘ఖిలాడి’అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడని తెలుస్తుంది. వీటిలో ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే మరోకటి బిజినెస్ మ్యాన్ పాత్ర అని ఫిలిం నగర్లో టాక్ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా చక చక పూర్తిచేస్తున్నాడు మాస్ రాజ్. అయితే జనవరి 26న మాస్ రాజా పుట్టినరోజు కావడంతో ఖిలాడి నుండి ఏదైనా సర్ప్రైజ్ వస్తుందేమో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్  కానీ ఏదైనా వీడియోను రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : Krishnam Raju : ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు