Ravi Teja: ఆర్‌ఆర్‌ఆర్ ప్రకటనతో ఆలోచనలో పడ్డ రామారావు.. విడుదల తేదీ మార్చే యోచనలో..
Ravi Teja: కరోనా మహమ్మారితో మూగబోయిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి సందడి మొదలైంది. కరోనా ప్రభావం తగ్గుతుండడం, ప్రభుత్వాలు సైతం ఆంక్షలు సడలిస్తుండడంతో మళ్లీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తేదీని...
Ravi Teja: కరోనా మహమ్మారితో మూగబోయిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి సందడి మొదలైంది. కరోనా ప్రభావం తగ్గుతుండడం, ప్రభుత్వాలు సైతం ఆంక్షలు సడలిస్తుండడంతో మళ్లీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తేదీని ప్రకటించిందో లేదో వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 5 సినిమాల విడుదల తేదీని ప్రకటించాయి. దీంతో టాలీవుడ్‌లో మళ్లీ సందడి మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి మాస్ మహారాజా రవితేజ వచ్చి చేరారు. రవితేజ హీరోగా నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న రామరావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గతంలో మార్చి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తేదీలో మార్పు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చిత్ర యూనిట్ చేసిన ప్రకటన చెబుతోంది.
సినిమా విడుదల విషయంలో చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రకటనలో.. ‘మేము మా సినిమాను ఎంతగానో గౌరవిస్తున్నాము. అలాగే ఇతర సినిమాలపై కూడా మాకు అపారమైన గౌరవం ఉంది. గతంలో రామారావు ఆన్‌డ్యూటీని మార్చి 25న విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ తాజా పరిణామాల కారణంగా మార్చి 25 లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలనుకుంటున్నాము’ అంటూ చిత్ర యూనిట్ తెలిపింది.
ఇదిలా ఉంటే మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్ విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామా రావు ఆన్ డ్యూటీ యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అందుకోసమే ముందు జాగ్రత్తలో భాగంగా చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు.
Winter Drinks: చలికాలంలో ఈ పానీయాలు ఒక్కసారైనా తాగాలి.. వివిధ ప్రాంతాల స్పెషల్ డ్రింక్స్
వంటగదిలో ఉండే ఈ 7 పదార్థాలు అద్భుతం.. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో వ్యాధులకు పరిష్కారం..