శ్రీదేవికి.. వర్మ రొమాంటిక్ ట్వీట్..!

డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్శ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. సమాజంలో ప్రస్తుతం జరిగే సమస్యలపై.. తొణకకుండా.. వెంటనే స్పందించే డైరెక్టర్. ఏ విషయమైనా.. సూటిగా చెప్పేస్తారు. ఏ విషయంపైనైనా.. ఘాటుగా ట్వీట్లు కూడా చేస్తారు. వర్మకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పారు. శ్రీదేశి మరణం పట్ల ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యారు. కాగా.. తాజాగా.. రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్విట్టర్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:00 pm, Sat, 24 August 19
శ్రీదేవికి.. వర్మ రొమాంటిక్ ట్వీట్..!

డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్శ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. సమాజంలో ప్రస్తుతం జరిగే సమస్యలపై.. తొణకకుండా.. వెంటనే స్పందించే డైరెక్టర్. ఏ విషయమైనా.. సూటిగా చెప్పేస్తారు. ఏ విషయంపైనైనా.. ఘాటుగా ట్వీట్లు కూడా చేస్తారు.

వర్మకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పారు. శ్రీదేశి మరణం పట్ల ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యారు. కాగా.. తాజాగా.. రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్విట్టర్ ద్వారా ఓ రొమాంటిక్ ట్వీట్ చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా.. వర్మ కృష్ణుడి గెటప్‌లో ఉన్నట్టుగా, శ్రీదేవి గోపిక వేషంలో ఉన్నట్టుగా ఓ వీడియోను క్రియేట్ చేసి.. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో బ్యాంక్‌గ్రౌండ్‌లో.. శ్రీదేవి, వర్మ వాయిస్‌లు వచ్చాయి. ఒకరికి ఒకరు పంచ్‌లు వేసుకున్నట్టుగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు.. వావ్ అంటూ.. షాకింగ్ సింబల్స్‌ని పెడుతూ.. చిరునవ్వులు చిందిస్తున్నారు. మరోసారి వర్మ ద్వారా.. అందాల రాణి శ్రీదేవి తలచుకున్నటైంది.

https://www.instagram.com/p/B1f5js_lwPT/