దోమకొండలో రామ్ చరణ్ దంపతుల పూజలు
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు దోమకొండ శివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను, ఫొటోలను ఉపాసన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. అయితే కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమకొండ శివాలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. సుమారు 800ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో ఈ దేవాలయం నిర్మితమైంది. కాగా దోమకొండ కోటను 400ఏళ్ల క్రితం ఉపాసన పూర్వీకులు కట్టించగా.. […]

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు దోమకొండ శివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను, ఫొటోలను ఉపాసన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు.
అయితే కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమకొండ శివాలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. సుమారు 800ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో ఈ దేవాలయం నిర్మితమైంది. కాగా దోమకొండ కోటను 400ఏళ్ల క్రితం ఉపాసన పూర్వీకులు కట్టించగా.. ప్రతి ఏడాది ఆమె ఆ కోటను సందర్శిస్తూనే ఉంటారు.
Shraddha, Bhakti & complete LOVE & devotion to Lord Shiva. ?? OM NAMAH SHIVAYA #ramcharan at the #Domakonda Shivalayam ?? restore ancient temples pic.twitter.com/sme3oPMo7P
— Upasana Konidela (@upasanakonidela) March 4, 2019