రకుల్‌ కీలక నిర్ణయం.. నిర్మాతలు హ్యాపీ

కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కూడా ఉంది. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, సెట్స్‌ మీదకు వెళ్లేందుకు హీరో, హీరోయిన్లు ఆసక్తిని చూపడం లేదు

రకుల్‌ కీలక నిర్ణయం.. నిర్మాతలు హ్యాపీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2020 | 4:07 PM

కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కూడా ఉంది. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, సెట్స్‌ మీదకు వెళ్లేందుకు హీరో, హీరోయిన్లు ఆసక్తిని చూపడం లేదు. పని కంటే ప్రాణం ముఖ్యమని అందరూ ఇళ్లలోనే ఉన్నారు. అయితే నటీనటులు తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. దీని వలన నిర్మాతలు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాము నిర్మించే చిత్రాలు మధ్యలో ఉండటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు పలు నిర్మాణ సంస్థలు తమ దగ్గర పనిచేసే వారికి జీతాలు చెల్లించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రకుల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తన రెమ్యునరేషన్‌లో ఏకంగా 50శాతం తగ్గించుకుంటున్నట్లు ఆమె నిర్మాతలకు చెప్పారట. దీంతో నిర్మాతలు సైతం సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ముందు ఒక్కో సినిమాకు రూ.1.5కోట్లు తీసుకుంటూ వచ్చిన రకుల్, ఇప్పుడు 75లక్షలే తీసుకుంటానని తెలిపిందట. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకు ఇబ్బంది కలిగించకూడదనే రకుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రకుల్‌ ఒక్కటే కాదు పలువురు టాప్ హీరోలు కూడా తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.