‘లక్ష్మీ బాంబ్‌’కు లారెన్స్ రీ ఎంట్రీ

ముంబయి: ‘కాంచన’ హిందీ రీమేక్‌ లోకి దర్శకుడు లారెన్స్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.  ‘లక్ష్మీ బాంబ్‌’కు తిరిగి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్షయ్‌ కుమార్‌ ఇందులో కథానాయకుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే ఫస్ట్‌లుక్‌ను చిత్ర దర్శకుడైన తనకు తెలియకుండా విడుదల చేశారని లారెన్స్‌ హర్ట్ అయ్యారు. పోస్టర్‌ డిజైన్‌ కూడా తనకు నచ్చలేదని అన్నారు. దీంతో […]

‘లక్ష్మీ బాంబ్‌’కు లారెన్స్ రీ ఎంట్రీ
Ram Naramaneni

|

Jun 02, 2019 | 10:46 AM

ముంబయి: ‘కాంచన’ హిందీ రీమేక్‌ లోకి దర్శకుడు లారెన్స్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.  ‘లక్ష్మీ బాంబ్‌’కు తిరిగి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్షయ్‌ కుమార్‌ ఇందులో కథానాయకుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే ఫస్ట్‌లుక్‌ను చిత్ర దర్శకుడైన తనకు తెలియకుండా విడుదల చేశారని లారెన్స్‌ హర్ట్ అయ్యారు. పోస్టర్‌ డిజైన్‌ కూడా తనకు నచ్చలేదని అన్నారు. దీంతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. అక్షయ్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయనపై అభిమానంతో స్క్రిప్టును వారికే ఇచ్చేస్తానని తెలిపారు.

కాగా అక్షయ్‌ మళ్లీ లారెన్స్‌ని బుజ్జగించి డైరక్షన్ చేయమని కోరారు. దానికి లారెన్స్ కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను లారెన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘మీరు (ఫ్యాన్స్‌) కోరుకున్నట్లే ‘లక్ష్మీ బాంబ్‌’ ప్రాజెక్టుకు తిరిగి నేనే దర్శకత్వం వహిస్తున్నా. నా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకుని, సమస్యను పరిష్కరించిన అక్షయ్‌ కుమార్‌ సర్‌కు ధన్యవాదాలు. నిర్మాత షబీనా ఖాన్‌కు కూడా కృతజ్ఞతలు. నాకు గౌరవం ఇచ్చిన మీ ఇద్దరికీ థాంక్స్‌. ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అక్షయ్‌ సర్‌’ అని లారెన్స్‌ పేర్కొన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu