పెళ్లి కొడుకును వెతకమంటున్న తమన్నా..!

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా ఆమె నటించిన ‘అభినేత్రి 2’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ తమన్నా. తాజా మీడియా సమావేశంలో తన పెళ్లి ప్రస్తావన గురించి చర్చ రాగా.. ‘నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను, మా చిత్ర దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌ను కూడా ఓ […]

పెళ్లి కొడుకును వెతకమంటున్న తమన్నా..!
Follow us

|

Updated on: Jun 03, 2019 | 10:20 AM

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా ఆమె నటించిన ‘అభినేత్రి 2’ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ తమన్నా.

తాజా మీడియా సమావేశంలో తన పెళ్లి ప్రస్తావన గురించి చర్చ రాగా.. ‘నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను, మా చిత్ర దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌ను కూడా ఓ సంబంధం చూడమని చెప్పాను, మీరు కూడా మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే నాతో చెప్పండి అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది తమన్నా.