AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ‘దృశ్యం’ దర్శకుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్

దృశ్యం మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. గత నెలలోనే ఈ మూవీ ఓరిజినల్ వెర్షన్ స్ట్రీమింగ్ కు రాగా ఇవాళ్టి నుంచే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

OTT Movie:  ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 17, 2026 | 9:09 PM

Share

ఈ వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. ఉస్తాద్ భగత్ సింగ్, సంభవం అధ్యాయం ఒన్ను, సుయోధన, యూత్, అలా చేరే సీతారాముని చెంతకు, టోస్టర్ వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలాగే పోచమ్మ, మట్కాకింగ్ లాంటి ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే వీటితో పాటు ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్ కూడా శుక్రవారం (ఏప్రిల్ 17) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైంది. ‘దృశ్యం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. దృశ్యం సినిమాల్లాగే ఈ మూవీ కూడా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక గత నెల చివరలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మలయాళ వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్.. కూతురి మరణానికి కారణమైన వారిపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. శ్యామ్యూల్ జోసెఫ్(జోజూ జార్జ్) తన గతాన్ని వదిలేసి భార్య, కూతురితో కలిసి జీవిస్తుంటాడు. అయితే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే కూతురు అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. కొన్ని రోజుల తర్వాత ఐరీన్ శవమై కనిపిస్తుంది. ఆమె మరణం వెనక ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. మరోవైపు కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు ఇలా జరగడంతో శామ్యూల్ పిచ్చివాడైపోతాడు. తన కూతురును చంపిన వారిని పట్టుకోవాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాడు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరికి తనే రంగంలోకి దిగుతాడు.

అయితే శామ్యూల్ కు . స్థానిక పోలీసాఫీసర్ ఆంటోని(బిజూ మేనన్) తరచూ అడ్డు తగులుతుంటాడు. తనకున్న అధికారంతో శామ్యూల్‌ను బాగా ఇబ్బంది పెడుతుంటాడు. ఇదే క్రమంలో జేవియర్ కూడా తన కూతురిని చంపిన వారిలో ఉన్నాడని శ్యామ్యూల్ తెలుసుకుంటాడు. అలా శామ్యూల్, జేవియర్ కు మధ్యన ఓ మైండ్ గేమ్ నడుస్తుంది. మరి చివరికి ఆ పోలీస్ ఆఫీసర్‌ కి శామ్యూల్ ఎలా బుద్ది చెప్తాడు ? అసలు శ్యామ్యూల్ కూతురిని ఎందుకు చంపారు? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ఆకట్టుకునే కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమ పేరు ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan). ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?
ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?