AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదేనా.. టాప్ 5 లిస్ట్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

IPL 2026 Best Catches: ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసే సమయానికే మైదానంలో కళ్లు చెదిరే విన్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాలిలో తేలుతూ ఫీల్డర్లు అందుకుంటున్న క్యాచ్‌లు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు క్యాచ్‌తో మొదలైన ఈ సందడి, సీజన్ అత్యుత్తమ క్యాచ్‌ ఏది అనే చర్చకు దారితీసింది.

Video: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదేనా.. టాప్ 5 లిస్ట్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..
Ipl 2026 Best Catches
Venkata Chari
|

Updated on: Apr 18, 2026 | 6:40 AM

Share

IPL 2026 Best Catches: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 16న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య కొట్టిన బంతి సిక్సర్‌గా వెళ్తుందని అందరూ భావించారు. కానీ, బౌండరీ వద్ద ఉన్న అయ్యర్ గాలిలోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. తాను బౌండరీ దాటుతున్నానని గ్రహించి, చాకచక్యంగా బంతిని లోపలికి విసరగా, సహచర ఆటగాడు గ్జేవియర్ బార్ట్లెట్ దానిని అందుకుని క్యాచ్ పూర్తి చేశాడు. ఈ ‘రిలే’ క్యాచ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఏకంగా సచిన్ ఈ క్యాచ్ చూసి బెస్ట్ క్యాచ్ అంటూ పొగడ్తలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఫిల్ సాల్ట్ గాలిలో చేసిన మాయాజాలం..

ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఇషాన్ కిషన్ 80 పరుగులతో విరుచుకుపడుతున్న వేళ, పాయింట్ దిశగా వెళ్తున్న బంతిని సాల్ట్ అడ్డంగా దూకి ఒకే చేత్తో పట్టుకున్నాడు. బెంగళూరు స్టేడియం మొత్తం ఈ విన్యాసానికి నిశ్శబ్దమైపోయింది.

మార్కో జాన్సెన్.. ఎత్తైన ఆకాశమే హద్దుగా..!

6 అడుగుల 8 అంగుళాల పొడవున్న మార్కో జాన్సెన్ తన ఎత్తును పూర్తిస్థాయిలో వాడుకుంటూ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ వద్ద జాన్సెన్ అమాంతం ఎగిరి ఒంటిచేత్తో పట్టేశాడు. బౌలర్ అర్ష్‌దీప్ కూడా నమ్మలేక నోరెళ్లబెట్టడం ఈ క్యాచ్‌ విశిష్టతను చెబుతుంది.

కీపర్ గా రిషభ్ పంత్ మెరుపు వేగం..

లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, లియామ్ లివింగ్‌స్టోన్ వికెట్ తీసిన తీరు అమోఘం. బ్యాటర్ ప్యాడిల్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా, పంత్ తన దిశను తక్షణమే మార్చుకుని గాలిలోకి దూకి ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడే. వికెట్ కీపర్‌గా ఆయనకున్న ఏకాగ్రతకు ఇది నిదర్శనం.

సర్ఫరాజ్ ఖాన్ సంబరాలు..

చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్ కొట్టిన వేగవంతమైన షాట్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో అడ్డంగా దూకి పట్టుకున్నాడు. గాలిలో సమాంతరంగా తేలుతూ ఆయన అందుకున్న ఈ క్యాచ్ సీజన్ లోనే అత్యంత కష్టతరమైనదిగా నిలిచింది. క్యాచ్ అందుకున్న తర్వాత ఆయన చేసిన పరుగు పాతకాలపు ఇమ్రాన్ తాహిర్ సంబరాలను గుర్తుచేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us