AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : రూ.10 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం.. కుర్రాళ్లు ఎమోషనలవుతున్న సినిమా ఇది..

10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఒక చిన్న సినిమా ఇప్పుడు రూ. 200 కోట్ల రూపాయల మార్కును దాటింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలనం సృష్టిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema : రూ.10 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం.. కుర్రాళ్లు ఎమోషనలవుతున్న సినిమా ఇది..
Vaazha 2
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2026 | 7:53 AM

Share

ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ధురంధర్ 2. మొన్నటివరకు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది ఈ సినిమా. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ తో ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించిన ఓ చిన్న సినిమా గురించి తెలుసుకుందామా. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. పెద్ద బడ్జెట్ కాదు.. అయినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు వాళా.. ఇది విపిన్ దాస్ రచన.. ఆనంద్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళీ చిత్రం. 2024లో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్ర రెండవ భాగం ఏప్రిల్ 2న విడుదలైంది. ఈ చిత్రానికి కూడా విపిన్ దాస్ స్క్రీన్ ప్లే అందించారు. దీనికి సవిన్ దర్శకత్వం వహించారు.

వాళా 2 చిత్రం పాఠశాల రోజుల్లో విద్యార్థుల మధ్య జరిగే సంఘటనలను హాస్యభరితంగా, అదే సమయంలో భావోద్వేగభరితంగా చూపిస్తుంది. ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని చాలా మంది యువ నటులు కొత్తవారే. ఇందులో పెద్ద స్టార్ నటులు ఎవరూ లేరు. అయినప్పటికీ, ఈ చిత్ర కథనం అభిమానులను మెప్పించింది. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా కేరళలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును దాటింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రాన్ని త్వరలో తమిళ, తెలుగు భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. దీనివల్ల సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయని అంటున్నారు. ఈ ఏడాది మలయాళంలో ‘వాజ 2’ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి :  Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

Follow Us