‘మహాసముద్రం’లో ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ..!

ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించనున్న చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. సిద్ధార్థ్ విలన్‌గా కనిపించబోతున్నారు.

'మహాసముద్రం'లో ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ..!

ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించనున్న చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. సిద్ధార్థ్ విలన్‌గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో ఒక హీరోయిన్‌గా సాయి పల్లవి ఫైనల్ అయినట్లు ఆ మధ్యన వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్‌గా బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ఈ మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులోని పాత్ర నచ్చేయడంతో రాశిఖన్నా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసినట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా గతేడాది రెండు మంచి హిట్లను ఖాతాలో వేసుకున్న రాశిఖన్నా.. ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇక ప్రస్తుతం రాశిఖన్నా తమిళంలో అర్మణై 3, అరువా చిత్రాల్లో నటిస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu