సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్….
సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి..తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సినీ ఆర్టిస్ట్ సాయి సుధ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి..తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సినీ ఆర్టిస్ట్ సాయి సుధ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో శ్యామ్ కే నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే బెయిల్ పై బయటికి వచ్చాడు శ్యామ్ కే నాయుడు. కాంప్రమైజ్ అయినట్లు శ్యామ్ కే నాయుడు సంబంధిత పత్రాలతో పిటిషన్ వేయడంతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే బాధితురాలు సంతకం మార్ఫింగ్ చేసి శ్యామ్ కే నాయుడు బెయిల్ పిటిషన్ వేసినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించింది సాయి సుధ. దొంగ సంతకం పెట్టి, బెయిల్ కు తాను ఒప్పుకున్నట్లు నకిలీ పత్రాన్ని సృష్టియించాడని న్యాయస్థానంలో తెలిపింది బాధితురాలు. దీంతో విచారణ చేసిన కోర్టు..బెయిల్ ను రద్దు చేసింది.




