AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను క్షేమ‌మే..మీరు జాగ్ర‌త్త‌..జాన‌క‌మ్మ సందేశం..

తాను క్షేమంగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని గాయని ఎస్‌.జానకి తెలిపారు. సోష‌ల్ మీడియాలో వచ్చే రూమ‌ర్స్ నమ్మొదని ఆడియో సందేశాన్ని పంపారు.

నేను క్షేమ‌మే..మీరు జాగ్ర‌త్త‌..జాన‌క‌మ్మ సందేశం..
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2020 | 11:34 PM

Share

తాను క్షేమంగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని గాయని ఎస్‌.జానకి తెలిపారు. సోష‌ల్ మీడియాలో వచ్చే రూమ‌ర్స్ నమ్మొదని ఆడియో సందేశాన్ని పంపారు. ఎస్‌.జానకి తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌ని, కన్నుమూశారంటూ గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు స‌ర్కులేట్ అయ్యాయి. కాగా ఈ వార్త‌ల‌పై ఆమె స్పందించారు.

”నేను ఆరోగ్యంగా ఉన్నా. ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్యా లేదు. సోష‌ల్ మీడియా వేదికగా పెట్టే వాటిని నమ్ముతూ కూర్చుంటే మ‌నం ఏం చేయ‌లేం. నా అభిమానులందరూ బాధ‌ప‌డుతూ ఫోన్ చేస్తున్నారు. వాళ్లకు ధైర్యం చెప్ప‌డ‌మే స‌రిపోయింది . తెలిసీ, తెలియకుండా ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేస్తారు. విష‌యం తెలియ‌కుండా ఎవరికి తోచినట్లు వారు పోస్ట్‌లు పెట్టొద్దు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అందరూ జాగ్రత్తలు తీసుకోండి” అని జానకి సందేశాన్ని పంపారు.