‘విరాట పర్వం’కు మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు

రానా హీరోగా వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. సాయి పల్లవి ఇందులో హీరోయిన్‌గా నటించగా.. ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహిబ్, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

'విరాట పర్వం'కు మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు

రానా హీరోగా వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం. సాయి పల్లవి ఇందులో హీరోయిన్‌గా నటించగా.. ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహిబ్, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యింది. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో మూవీ షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. విరాట పర్వం ఆగిపోయింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇంతవరకు షూటింగ్‌ జరుపుకున్న టాకీ పార్ట్‌కి సంబంధించిన రీ రికార్డింగ్‌, డబ్బింగ్‌ పనులను దర్శకనిర్మాతలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేసేందుకు సమయం పట్టనుండగా.. ఆ లోపు ఈ పనులను పూర్తి చేసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే పోస్ట్‌ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న విషయం తెలిసిందే.

Click on your DTH Provider to Add TV9 Telugu