Puli Meka: ఓటీటీలో దుమ్మురేపుతోన్న ‘పులి మేక’ వెబ్‌ సిరీస్‌.. 100 మిలియన్స్‌ వ్యూయింగ్‌ మినిట్స్‌ దాటేసి.

ఆది, లావాణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన పులి మేక వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ 100 మిలియన్స్‌ వ్యూయింగ్ మినిట్స్‌ సాధించడం విశేషం...

Puli Meka: ఓటీటీలో దుమ్మురేపుతోన్న 'పులి మేక' వెబ్‌ సిరీస్‌.. 100 మిలియన్స్‌ వ్యూయింగ్‌ మినిట్స్‌ దాటేసి.
Puli Meka
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 09, 2023 | 9:09 PM

ఆది, లావాణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన పులి మేక వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ 100 మిలియన్స్‌ వ్యూయింగ్ మినిట్స్‌ సాధించడం విశేషం. జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ క‌లిసి రూపొందించిన పులి మేక ఒరిజిన‌ల్‌లో 8 ఎపిసోడ్స్తో విడుదల చేశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఆడియెన్స్ మ‌న్నన‌లు పొందుతూ దూసుకెళ్తోంది.

స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా పులి మేక ఆడియెన్స్‌ను క‌ట్టి ప‌డేసింది. సిరీస్‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్నుల‌ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ పాత్రలు స‌హా ఎంటైర్ సిరీస్‌ను ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి కిరణ్‌ ప్రభ అనే పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో అద్భుతంగా నటించింది.

ఆది సైతం తన పాత్రను అద్భుతంగా పోషించాడు. ఇటీవల ఇన్వెస్టిగేటివ్‌ మూవీలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్‌ సిరీస్‌లను బాగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చిన పులి మేక సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్లో ‘బిగ్ బాస్’ ఫేమ్ సిరి హన్మంతు ప్రధాన పాత్రలో నటించారు. సిరి పాత్రే వెబ్‌ సిరీస్‌కు కీలకమని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..