AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: తొలిసారి కవల పిల్లలతో బయటకొచ్చిన నయన్‌ దంపతులు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో.

సుమారు ఐదేళ్లు ప్రేమలో ఉన్న నయనతార, విగ్నేష్‌లు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఎన్నో రకాల పుకార్లకు చెక్‌ పెడుతూ ఈ స్టార్‌ కపుల్‌ గతేడాది జూన్‌ 9వ తేదీన అంగరంగవైభవంగా వివాహం..

Nayanthara: తొలిసారి కవల పిల్లలతో బయటకొచ్చిన నయన్‌ దంపతులు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో.
Nayanthara
Narender Vaitla
|

Updated on: Mar 09, 2023 | 8:43 PM

Share

సుమారు ఐదేళ్లు ప్రేమలో ఉన్న నయనతార, విగ్నేష్‌లు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఎన్నో రకాల పుకార్లకు చెక్‌ పెడుతూ ఈ స్టార్‌ కపుల్‌ గతేడాది జూన్‌ 9వ తేదీన అంగరంగవైభవంగా వివాహం జరుపుకున్నారు. ఇదిలా ఉంటే వివాహం జరిగి ఏడాది కూడా నిండకముందే తాము కవల పిల్లలకు జన్మనిచ్చామని ఈ కపుల్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సరోగసి విధానం ద్వారా ఈ జంట పిల్లలకు జన్మనిచ్చినట్లు తర్వాత తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఈ కపుల్ గాలికి వదిలారనే చర్చ జరిగింది. అయితే చివరిగా క్లీన్‌ చిట్ రావడంతో కథ సుఖాంతమైంది.

ఇక ఈ జంట ప్రస్తుతం పేరెంటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అడపాదడపా సోషల్‌ మీడియాలో ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఎక్కడా చిన్నారుల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ జంట ఇప్పటి వరకు తమ చిన్నారులతో బయట కనిపించింది లేదు. కానీ తాజాగా నయన్‌, విఘ్నేష్‌లు తొలిసారి బయటకు వచ్చారు. నయన్‌, విఘ్నేష్‌లు చేరో చిన్నారిని ఎత్తుకొని ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో కనిపించిన కపుల్‌ను మీడియా వాళ్లు కెమెరాల్లో బంధించారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ కపుల్‌ తమ చిన్నారుల ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇద్దరికీ ఒకే రకం డ్రెస్‌ వేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ జంట తమ చిన్నారులను అధికారికంగా ఎప్పుడు చూపిస్తారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..