సమంత మూవీ వివాదం.. నిర్మాత అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

సమంత నటించిన ఓ చిత్రంపై ఇంకా వివాదం నడుస్తోంది. ఈ కేసులో ఆ సినిమా నిర్మాతను అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ, సమంతలతో నందినీ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘జబర్దస్త్‌’. దీనిని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. కాగా ఈ మూవీలో 19సీన్లను తమ చిత్రం బాండ్ బాజా బరాత్‌ నుంచి యథావిధిగా కాపీ చేశారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సినిమాను టెలివిజన్‌లో […]

  • Publish Date - 1:30 pm, Thu, 1 August 19 Edited By:
సమంత మూవీ వివాదం.. నిర్మాత అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

సమంత నటించిన ఓ చిత్రంపై ఇంకా వివాదం నడుస్తోంది. ఈ కేసులో ఆ సినిమా నిర్మాతను అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ, సమంతలతో నందినీ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘జబర్దస్త్‌’. దీనిని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. కాగా ఈ మూవీలో 19సీన్లను తమ చిత్రం బాండ్ బాజా బరాత్‌ నుంచి యథావిధిగా కాపీ చేశారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సినిమాను టెలివిజన్‌లో టెలికాస్ట్ చేయద్దంటూ ఇటీవల ఆర్డర్స్ జారీ చేసింది.

ఇదిలా ఉండే ఈ మూవీ నిర్మాణంలో ఉన్నప్పుడు ఓ ఛానెల్ జబర్దస్త్ శాటిలైట్ రైట్స్‌ను రూ.3.5కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా వారు నిర్మాతను కోరారు. అయితే ఆ మొత్తాన్ని బెల్లంకొండ ఇంతవరకు చెల్లించలేదు. దీంతో అప్పుడు తీసుకున్న రూ.3.5కోట్లు ప్రస్తుతం రూ.11.75కోట్లకు చేరింది. దీంతో ఈ వివాదంపై వారు కోర్టును ఆశ్రయించగా.. బెల్లంకొండ సురేష్‌పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.