అతిలోక సుందరి కల నెరవేరబోతుందా..?

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ.. సినిమా పరంగాను, వ్యక్తిగతంగాను భిన్నంగా ఉండే హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అజిత్ నటించిన నేర్కొండ పార్వై చిత్రం ఆగష్టు 8న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయనకు 59వ చిత్రం. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన పింక్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. అమితాబ్‌బచ్చన్‌ పోషించిన పాత్రలో అజిత్‌ నటించగా ఆయనకు జంటగా నటి విద్యాబాలన్‌ నటించింది. ఇక హిందీలో తాప్సీ పాత్రను తమిళంలో నటి […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:14 am, Thu, 1 August 19
అతిలోక సుందరి కల నెరవేరబోతుందా..?

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ.. సినిమా పరంగాను, వ్యక్తిగతంగాను భిన్నంగా ఉండే హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అజిత్ నటించిన నేర్కొండ పార్వై చిత్రం ఆగష్టు 8న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయనకు 59వ చిత్రం. హిందీలో సంచలన విజయాన్ని సాధించిన పింక్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. అమితాబ్‌బచ్చన్‌ పోషించిన పాత్రలో అజిత్‌ నటించగా ఆయనకు జంటగా నటి విద్యాబాలన్‌ నటించింది. ఇక హిందీలో తాప్సీ పాత్రను తమిళంలో నటి శ్రద్ధాశ్రీనాథ్‌ పోషించింది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మించారు.

నేర్కొండ పార్వై చిత్ర యూనిట్‌కు బోనీకపూర్ ధన్యవాదాలు తెలుపుతూ.. అజిత్ 60వ చిత్రాన్ని కూడా హెచ్. వినోద్ దర్శకత్వంలో తాను నిర్మించబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఇందులో అజిత్ బైక్ రేస్‌లో పాల్గొనాలని తపించే రేసర్‌గా నటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇక ఈ చిత్రం ద్వారా దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కల నెరవేరబోతోంది. శ్రీదేవి పుట్టింది తమిళనాడులోనే గనుక.. ఆమె తన కూతురు జాన్వీని తమిళంలో హీరోయిన్‌గా పరిచయం చేయాలని ఆశ పడింది. అది తీరకుండానే హఠాన్మరణం పొందింది. అయితే శ్రీదేవి కలను ఆమె కూతును జాన్వీ నిజం చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. అజిత్ తరువాతి చిత్రంలో అతడికి పెద్ద కూతురిగా జాన్వీ నటించనున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే జాన్వీ తన తల్లి కలను నిజం చేయబోతోందని తెలుస్తోంది.