నయీంతో లింక్.. లిస్ట్‌లో ఖాకీలు, పొలిటికల్ లీడర్లు

గ్యాంగ్‌స్టర్‌ నయీంకు చెందిన కేసులో తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులుతో పాటు పోలీస్ శాఖలోని కొందరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో అతడితో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే కమిటీ ఆర్టీఐకు దరాఖాస్తు చేసింది. దీనికి స్పందిస్తూ ఆర్టీఐ నయీం కేసు వివరాలను వెల్లడించింది. ఇక అందులో మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేరు ఉంది. నయీం కేసులో ఉన్నవారి పేర్లు […]

  • Updated On - 2:52 pm, Thu, 1 August 19 Edited By: Pardhasaradhi Peri
నయీంతో లింక్.. లిస్ట్‌లో ఖాకీలు, పొలిటికల్ లీడర్లు


గ్యాంగ్‌స్టర్‌ నయీంకు చెందిన కేసులో తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులుతో పాటు పోలీస్ శాఖలోని కొందరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో అతడితో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే కమిటీ ఆర్టీఐకు దరాఖాస్తు చేసింది. దీనికి స్పందిస్తూ ఆర్టీఐ నయీం కేసు వివరాలను వెల్లడించింది. ఇక అందులో మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేరు ఉంది.

నయీం కేసులో ఉన్నవారి పేర్లు
అడిషనల్ ఎస్పీలు: శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్ రెడ్డి

డీఎస్పీలు: శ్రీనివాస్, సాయి మనోహర్ రావు, శ్రీనివాసరావు, ప్రకాష్ రావు, వెంకటనర్సయ్య, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న

ఇన్‌స్పెక్టర్లు: మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకట్ రెడ్డి, వెంకట సూర్య ప్రకాశ్, రవి కిరణ్ రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్ గౌడ్, దినేష్, సాదిఖ్‌మియా

రాజకీయ నేతలు: మాజీ జెడ్పీటీసీ సుధాకర్, భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేష్, మాజీ సర్పంచ్ పింగల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ, వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య. వీరి పేర్లు తాజాగా బయటికొచ్చాయి.