AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mail Trailer: ప్రియదర్శి ‘మెయిల్’ టీజర్ రిలీజ్.. మనుషులకు రోగం ఎట్లనో కంప్యూటర్లకు వైరస్ అట్లా..

ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'మెయిల్'. దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్

Mail Trailer: ప్రియదర్శి 'మెయిల్' టీజర్ రిలీజ్.. మనుషులకు రోగం ఎట్లనో కంప్యూటర్లకు వైరస్ అట్లా..
Rajitha Chanti
|

Updated on: Jan 13, 2021 | 1:45 PM

Share

ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. దర్శకుడు ఉదయ్ గుర్రాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో 2005..అప్పుడప్పుడే పల్లెల్లో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు అంటూ మొదలయ్యే ట్రైలర్ ఎంతో ఆసక్తికగా కనిపిస్తోంది. కంప్యూటర్ నేర్చుకోవాలనే కోరిక ఉన్న యువకుడి చుట్టూ ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ యాసలో ప్రియదర్శి పలికే మాటలకు ప్రేక్షకులను మళ్లీ మునపటి రోజులలోకి తీసుకెళ్తుందని చెప్పవచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఓటీటీ ఫ్లాట్ ఫాం వేదిక అయిన ఆహాలో విడుదల కానుంది. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమా వచ్చిన మొదటి రోజులలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని దర్శకుడు చాలా చక్కగా రూపొందించాడు. మెయిల్ పల్లెటూరిలో ముచ్చటిగా సాగిపోతుంది.