Lata Mangeshkar: శతాబ్దానికి ఒక్కరు మాత్రమే.. లతాజీ మరణంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతుల సంతాపం..
లెజెండరీ సింగర్, ఇండియన్ నైటింగెల్, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ ఉదయం కన్నుముశారు. 92 ఏళ్ల లతాజీ జనవరి 11న కొవిడ్ (Covid) స్వల్ప లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు.
లెజెండరీ సింగర్, ఇండియన్ నైటింగెల్, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ ఉదయం కన్నుముశారు. 92 ఏళ్ల లతాజీ జనవరి 11న కొవిడ్ (Covid) స్వల్ప లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా కూడా సోకడంతో డాక్టర్ ప్రతీత్ సంధాని నేతృత్వంలోని ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. గత నెల చివరిలో ఆమె కరోనాతో పాటు న్యుమోనియా నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె వయసు దృష్ట్యా ఐసీయూలోనే ఉంచి చికిత్స కొనసాగించారు వైద్యులు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నాం లతాజీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తూ ఈరోజు ఉదయం గాన కోకిల తుది శ్వాస విడిచారు. కాగా తన మధుర గానంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న లతా దీదీ ఇక లేరన్న వార్తను ఆమె అభిమాలనుతోపాటు సగటు భారతీయ సినీ ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈక్రమంలో ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూసోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.
గుండె ముక్కలైంది..
కాగా లతా మంగేష్కర్ మరణించారన్న వార్త తన గుండెను ముక్కలు చేసిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా లతాజీకి నివాళి అర్పించిన ఆయన ‘ ప్రపంచంలో ఉన్న లతా మంగేష్కర్ అభిమానులందరికీ ఇది శరాఘాతం లాంటి వార్త. మన దేశ గొప్పదనం గురించి ఆమె పాడిన పాటలు.. ఎన్నో తరాల్లోని అంతరంగాలకు అద్దం పట్టాయి. ఆమె సాధించిన గొప్ప గొప్ప విజయాలకు మరేమీ సాటి రావు. ఇలాంటి కళాకారులు శతాబ్దంలో ఒకరు మాత్రమే పుడతారు. నేను ఆమెను కలిసిన ప్రతి సందర్భంలోనూ ఆమెలో ఉన్న మానవతా కోణాన్ని, దయాగుణాన్ని చూశాను. మధురమైన గొంతుతో ఎన్నో పాటలను పాడిన గళం ఇప్పుడు మూగబోయి ఉండొచ్చుగాక.. ఆమె పాటలు మాత్రం చిరకాలం ఉంటాయని, ఎప్పడూ ప్రతిధ్వనిస్తుంటాయి. లతాజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.
Lata-ji’s demise is heart-breaking for me, as it is for millions the world over. In her vast range of songs, rendering the essence and beauty of India, generations found expression of their inner-most emotions. A Bharat Ratna, Lata-ji’s accomplishments will remain incomparable. pic.twitter.com/rUNQq1RnAp
— President of India (@rashtrapatibhvn) February 6, 2022
ఆమె మరణం నన్ను కలిచి వేసింది..
లతాజీ మరణం తనను కలిచి వేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘ఇండియన్ నైటింగెల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్త నన్ను కలిచి వేసింది. ఆమె తన మధురమైన స్వరంతో గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యా్ప్తంగా ఉన్న సంగీతాభిమానులందరినీ అలరించారు. మెలోడీ క్వీన్‌గా బాలీవుడ్ పరిశ్రమను కొన్నేళ్ల పాటు ఏలారు. ఇప్పుడామె మరణంతో భారతీయ సంగీతం తన స్వరాన్ని కోల్పో్యినట్లయింది. ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆమె లేకపోయినా లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో పాటల రూపంలో ఆమె సజీవంగానే ఉంటారు. లతాజీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
भारतीय सिनेमा की सुर साम्राज्ञी लता मंगेशकर जी का निधन देश की और संगीत जगत की अपूरणीय क्षति है। लता जी के निधन से आज भारत ने अपना वह स्वर खो दिया है जिसने हर अवसर पर राष्ट्र की भावना को भावपूर्ण अभिव्यक्ति दी। उनके गीतों में देश की आशा और अभिलाषा झलकती थी। pic.twitter.com/K6NDlnh3jg
— Vice President of India (@VPSecretariat) February 6, 2022
Also Read:Lata Mangeshkar: లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు కేవలం రెండు మాత్రమే.. అవేంటో తెలుసా.?
ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పండగే.. జీతాలు 15 నుంచి 75 శాతం పెంపుకు ప్రణాళికలు..
Chanakya Niti: మనిషిలో ఈ 5 లక్షణాలు ఉండాలి.. లేనివారి జీవితం జంతువుతో సమానం అంటున్న చాణక్య..