Radhe Shyam Movie Release Live: థియేటర్లలో అడుగుపెట్టిన రాధేశ్యామ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ సందడి ఎలా ఉందో చూడండి..

Prabhas Radhe Shyam Release Live Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ రాధేశ్యామ్‌(Radhe Shyam) థియేటర్లలోకి అడుగుపెట్టాడు

Radhe Shyam Movie Release Live: థియేటర్లలో అడుగుపెట్టిన రాధేశ్యామ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ సందడి ఎలా ఉందో చూడండి..
Radheshyam

| Edited By: Anil kumar poka

Mar 11, 2022 | 8:56 PM

Prabhas Radhe Shyam Release Live Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ రాధేశ్యామ్‌(Radhe Shyam) థియేటర్లలోకి అడుగుపెట్టాడు. బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ లవ్ స్టొరీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున (మార్చ్ 11న) రిలీజ్ అయ్యింది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం సమ్మర్‌ను టార్గెట్‌ చేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు అదిరిపోవడం, సాహో తర్వాత సుమారు 3 ఏళ్ల తరువాత డార్లింగ్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుండడంతో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. లవర్ బాయ్ లుక్ లో ఉన్న ప్రభాస్ కట్ఔట్స్ తో థియేటర్లు మొత్తం నిండిపోయాయి. తీన్మార్ డప్పులు, బాణసంచా కాల్పులతో చాలా హంగామా చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో సీనియర్‌ నటులు కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ (Bhagyashree) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాటీ సిరీస్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన రాధేశ్యామ్‌ చిత్రం మొత్తం 5 భాషల్లో రిలీజ్‌ కానుంది. ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమాకు అపూర్వ స్పందన వచ్చింది. కాగా హైదరాబాద్ కూకట్‌పల్లి లోని అర్జున్, భ్రమరాంబిక, మల్లికార్జున థియేటర్లలో ఉదయం 4 గంటలకు రాధేశ్యామ్‌ బెనిఫిట్ షోస్ ప్రీమియర్ అయ్యాయి. మరి థియేటర్లలో రచ్చచేయడానికి సిద్ధమైన రాధేశ్యామ్‌ చిత్రం ఎలా ఉంది.? థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఎలా ఉంది.? లాంటి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మీకోసం..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 11 Mar 2022 03:08 PM (IST)

  బాలీవుడ్‌లో రాధేశ్యామ్‌కు అదిరిపోయే రివ్యూస్‌..

 • 11 Mar 2022 12:49 PM (IST)

  తెలుగు సినిమాకు ఈరోజు ఒక శుభదినం..

  రాధేశ్యామ్‌ చిత్ర బృందానికి స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి విషెస్‌ చెప్పాడు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశాడు. అలాగే యంగ్‌ హీరో అడవిశేశ్‌ కూడా రాధేశ్యామ్ చిత్ర బృందానికి ముందస్తు కంగ్రాట్స్ తెలిపాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈరోజు ఒక శుభదినమని అభివర్ణించాడు.

 • 11 Mar 2022 12:05 PM (IST)

  రాధేశ్యామ్‌ థియేటర్ల వద్ద లేడీ ఫ్యాన్స్‌ హంగామా!

  ప్రభాస్‌ రాధేశ్యామ్ విడుదల సంద్భంగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అభిమానులు ఈలలు, కేకలు వేస్తూ, డప్పులు కొడుతూ డ్యాన్స్‌ లు చేస్తున్నాయి. ఇక డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ చిత్రాల తర్వాత ఓ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌ నటిస్తుండడంతో లేడీ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకుంటున్నారు. తూగోజిల్లాలోని అమలాపురంలో కేవలం మహిళల కోసమే ఒక స్ర్కీ్‌న్‌ను ఏర్పాటుచేశారు.

 • 11 Mar 2022 11:48 AM (IST)

  రాధేశ్యామ్ చూస్తూ చొక్కాలు చించుకున్న అక్కినేని సుశాంత్‌..

  రాధేశ్యామ్ విడుదల సందర్భంగా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. సినిమాకు సంబంధించి మీమ్స్‌ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈక్రమంలో అక్కినేని హీరో సుశాంత్ 'రాధేశ్యామ్' సినిమా చూస్తూ చొక్కాలు చించుకుంటోన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. సుశాంత్‌ నటించిన ఓ సినిమాలోని సీన్‌ ను రీక్రియేట్‌ చేస్తూ రూపొందించిన వీడియో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

 • 11 Mar 2022 11:39 AM (IST)

  అమెరికాలో రాధేశ్యామ్ టాక్‌ ఎలా ఉందంటే..

  నేడు విడుదలైన ప్రభాస్‌ రాధేశ్యామ్‌కు మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందంటూ చూసిన వారందరూ తమ అభిప్రాయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక అమెరికాలోనూ రాధేశ్యామ్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాలో ప్రభాస్‌, పూజల కెమిస్ట్రీ అదిరిపోయిందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, థమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేసిందని కామెంట్లు పెడుతున్నారు.

 • 11 Mar 2022 11:32 AM (IST)

  రాధేశ్యామ్‌ బృందానికి మా అధ్యక్షుడి విషెస్‌..

  రాధేశ్యామ్‌ విడుదల సందర్భంగా ఆ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్‌ చెప్పాడు నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

 • 11 Mar 2022 11:28 AM (IST)

  శ్రీకాకుళంలో రెబల్‌ స్టార్‌ నినాదాలతో దద్దరిల్లుతోన్న థియేటర్లు..

  రాధేశ్యామ్ విడుదలను పురస్కరించుకుని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చేస్తోన్న సందడి మాములుగా ఉండడం లేదు. రెబల్‌ స్టార్‌, డార్లింగ్‌ అంటూ అభిమానులు థియేటర్ల బయట, లోపల ఈలలు, కేకలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు.

 • 11 Mar 2022 11:23 AM (IST)

  దుబాయిలో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ హంగామా..

 • 11 Mar 2022 10:57 AM (IST)

  రాధేశ్యామ్ పై బుట్టబొమ్మ ట్వీట్..

  రాధేశ్యామ్ విడుదలను పురస్కరించుకుని హీరోయిన్ పూజాహెగ్డే ట్వీట్ చేసింది.  ప్రేమకోసం విధిని  స్వీకరించాల్సిన సమయమొచ్చిందని అందులో రాసుకొచ్చింది.

 • 11 Mar 2022 10:06 AM (IST)

  మహిళల కోసం రాధేశ్యామ్ స్పెషల్ షో..

  ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అభిమానుల సందడితో థియేటర్లు కళకళలాడుతున్నాయి.  కాగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని మహిళా ప్రేక్షకుల కోసం రాధేశ్యామ్ స్పెషల్ షో ప్రదర్శించారు. వీపీసీ థియేటర్లలోని ఒక స్ర్కీన ను కేవలం మహిళలకే కేటాయించి షో వేశారు. ఈ సందర్భంగా మహిళలు ఈలలు, కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

 • 11 Mar 2022 09:54 AM (IST)

  రాధేశ్యామ్‌ గురించి డైరెక్టర్‌ బాబీ ట్వీట్‌..

  ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్ నేడు థియేటర్లలో గ్రాండ్‌ గా రిలీజైంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ కే.ఎస్. రవీంద్ర (బాబీ) చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపాడు. ప్రభాస్‌ను సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్విట్టర్‌ లో తెలిపారు.

 • 11 Mar 2022 09:47 AM (IST)

  రాజాంలో థియేటర్‌ను సీజ్‌ చేసిన అధికారులు..

  శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో రాధేశ్యామ్ ప్రదర్శితమవుతోన్న అప్సర థియేటర్‌ను అధికారులు సీజ్‌ చేశారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్‌ షో ప్రదర్శించారని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభాస్‌ అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.

 • 11 Mar 2022 09:35 AM (IST)

  కర్నూలులో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ..

  రాధేశ్యామ్ రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి.  ఇక డార్లింగ్ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.  థియేటర్ల వద్ద తమ అభిమాన నటుడి కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. డప్పులు  వాయిస్తూ డ్యాన్సులు చేస్తున్నారు.

 • 11 Mar 2022 09:10 AM (IST)

  సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..

  రాధేశ్యామ్ విడుదలను పురస్కరించుకుని నటి మంచు లక్ష్మి ఆ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపింది. సినిమా పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షించింది. సిల్వర్‌ స్ర్కీన్‌పై ప్రభాస్‌ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది.

 • 11 Mar 2022 09:00 AM (IST)

  టికెట్ల ధరలకు రెక్కలు..

  ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్ విడుదల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. కాకినాడలో కొందరు థియేటర్ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా టికెట్ రేట్లను పెంచేశారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్‌ షోలు అంటూ భారీగా ధరలు పెంచారు. దీంతో సామాన్యలు టికెట్లు కొనలేని పరిస్థితి. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తు్న్నారు. ఇక జగ్గంపేట థియేటర్లలో అయితే టికెట్‌ రూ.200 నుంచి రూ. 380 రూపాయలు పలుకుతోంది.

 • 11 Mar 2022 08:46 AM (IST)

  ప్రభాస్‌కు గోపీచంద్‌ మలినేని విషెస్‌..

  యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. రాధేశ్యామ్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్ సాధించాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా నటీనటులు, చిత్రబృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపాడు.

 • 11 Mar 2022 08:42 AM (IST)

  సామర్ల కోటలో రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్ రచ్చ..

  రాధేశ్యామ్‌ రిలీజ్‌ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటలో ప్రభాస్‌ ఫ్యాన్స్ రచ్చ చేశారు. థియేటర్ల వద్ద డార్లింగ్ కటౌట్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. డప్పులు కొడుతూ, బాణసంచా కాలుస్తూ, డ్యాన్సులు చేస్తూ నానా హంగామా సృష్టించారు.

 • 11 Mar 2022 08:15 AM (IST)

  ప్రభాస్‌కు మెగా హీరోల ఆల్‌ ది బెస్ట్‌..

  రాధేశ్యామ్‌ విడుదల సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు మెగా హీరోలు విషెస్‌ తెలిపారు. సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా రాధేశ్యామ్ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు వరుణ్‌ తేజ్‌. అలాగే సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ట్వీట్‌ చేశాడు. ఎపిక్‌ లవ్‌ స్టోరీని తెరకెక్కించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడిందని, సిల్వర్‌ స్ర్కీన్‌పై అది కనిపిస్తుందని మరో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశాడు. సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

 • 11 Mar 2022 07:58 AM (IST)

  రాధేశ్యామ్‌ కు RRR సినిమా టీం విషెస్‌..

  నేడు థియేటర్లలో విడుదలైన ప్రభాస్‌ సినిమా 'రాధేశ్యామ్‌' కు RRR టీం విషెస్‌ చెప్పింది. పీరియాడికల్‌ ప్రేమకథను తెరకెక్కించడానికి డైరెక్టర్‌తో పాటు చిత్రబృందం ఎంతో కష్టపడిందని పేర్కొంది. ఈసినిమా ప్రభాస్‌ కు మరో బ్లాక్‌బస్టర్‌ అందించాలని ఆకాంక్షించారు.

 • 11 Mar 2022 07:42 AM (IST)

  ప్రభాస్‌ చిత్ర పటానికి 101 కొబ్బరికాయలు..

  ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రాధేశ్యామ్‌ ఎట్టకేలకు థియేటర్లలో అడుగుపెట్టింది. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కాగా ప్రభాస్‌ సినిమా విడుదల సందర్భంగా కర్మూలు జిల్లా ఎమ్మిగనూరు లో థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుచేశారు. ఇక ప్రభాస్ చిత్ర పటానికి 101 కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారు అభిమానులు.

 • 11 Mar 2022 07:34 AM (IST)

  రాధేశ్యామ్‌ థియేటర్‌ వద్ద విషాదం..

  గుంటూరు జిల్లా కారంపూడి మండలం కారంపూడిలో విషాదం చోటుచేసుకుంది. అభిమానుల సందడితో అపశ్రుతి చోటుచేసుకుంది రాధేశ్యామ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌ వద్ద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. మరొకరకి గాయాలయ్యాయి.

 • 11 Mar 2022 07:00 AM (IST)

  థియేటర్ల వద్ద ప్రభాస్‌ ఫ్యాన్స్ హంగామా..

  మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో సినిమా రావడంతో ప్రభాస్‌ అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రాధేశ్యామ్ సినిమా కటౌట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సినిమా రిలీజ్‌ కోసం డప్పులు వాయిస్తూ, బాణ సంచా కాలూస్తూ రచ్చ చేస్తున్నారు.

 • 11 Mar 2022 06:42 AM (IST)

  భారీ ఓపెనింగ్స్ పై కన్ను..

  సినిమా ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా  రాధేశ్యామ్ 7 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా. 'బాహుబలి' సిరీస్, 'సాహో' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి రానున్న భారీ బడ్జెట్ చిత్రం కావడం వల్ల ఈ సినిమాపై ఫ్యాన్స్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.  అదేవిధంగా పాన్ ఇండియా సినిమా 'సాహో' చిత్రం దక్షిణాదిలో హిట్ కాకపోయినా .. అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి.  ఇక బాలీవుడ్లో ప్రభాస్ సినిమాకు బ్రహ్మరథమే పట్టారు. దీంతీ ఈ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ తథ్యమని సినీ పండితులు అంటున్నారు.

Published On - Mar 11,2022 6:32 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu